లోకసభ ఎన్నికలు 2019 : విజ‌య‌వాడ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Vijayawada Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది. ఇక్కడి ఓటర్లు రాజకీయంగా క్రియాశీలతతో పాటు, పరిపక్వత ప్ర‌దిర్శిస్తుంటారు. ఇక ఇక్క‌డ మేజర్ రాజకీయ పార్టీలు వై.యస్.ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ మరియు అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టుతో పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడిప్పుడే త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంది. గ‌తంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట గా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు స‌మూలంగా మారిపోయాయి. ఈ నగరంలో మూడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అవి, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు. పెనమలూరు, మైలవరం మరియు గన్నవరం శాసనసభ నియోజకవర్గ ప్రాంతాలతో పాటు విజయవాడకు ఒక లోక్‌సభ నియోజకవర్గం కూడా ఉంది.

    విజ‌య‌వాడ పేరుకు ఉన్న చ‌రిత్ర‌:-

    విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై లభించిన క్రీస్తు శకం 927-933 కాలం నాటి రెండవ యుద్ధమల్లుని శాసనం ప్రకారం నేటి విజయవాడ రాజేంద్ర చోళపురం అనే పేరున్నట్లు పేర్కొన్నప్పటికి రెండు సవత్సరాల చరిత్రలో బెజవాడ, హెచ్చవాడ, విజయవాటికగా పిలువబడి, నేడు విజయవాడగా పిలవబడుతోంది.

    విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటాడు.కృష్ణాజిల్లాలోని 15 గ్రామాలతో కలిపి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు కాబోతున్నది.ప్రక్కనే కృష్ణానదికి అవతలివైపున 3కి.మీ.దూరంలోఉన్న తాడేపల్లి మునిసిపాలిటీనికూడా గ్రేటర్ లో కలపాలని తాడేపల్లి ప్రజలు కోరారు కానీ అది గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నందున గ్రేటర్లో కలిపేందుకు అధికారులు ప్రతిపాదించలేదు.వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.

    రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తి. చుక్కలనంటిన భూముల ధరలు

    ఇక్కడ పదేళ్ళ క్రితం గజం రూ.500 అన్నా కొనే నాధుడుండే వాడు కాదు. నేడు రోడ్డు వెంబడి ఉన్న స్థలం గజం 15వేల నుంచి 20వేలు ఉంటే, అమ‌రావ‌తిగా రూపొందిన త‌ర్వాత ఈ ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాలకు మహర్దశ తీసుకొచ్చింది.

    Vijayawada Constituency

    విజయవాడ విమానాశ్రయము
    విజయవాడ విమానాశ్రయం గన్నవరం నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి మరియు ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది. 3 May 2017న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ. అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతొ, 54.8% వ్రుధ్ధి నమొదు చేసింది.

    జ‌నాబా వివ‌రాలు.
    భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు కూడా ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
    నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.

    విద్యా సంస్థలు
    సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన సుమారు 8 ఎకరాలలో రేకుల షెడ్డు, 8 మంది టీచర్లతో ప్రారంభించబడింది. 1982 లో పాఠశాల నిల్డింగు సమకూరినది. 1987 లో జిమ్నాజియం నిర్మించబడింది. 1995లో ప్రాథమిక తరగతుల కోసం ప్రత్యేక భవనం నిర్మంచబడింది. ప్రస్తుతము 2500 విద్యార్థుల తో, 120 టీచర్ల తో, గత 25 ఏళ్ళ నుండి 100 % 10వ తరగతి సీ బీ ఎస్ సీ బోర్డు పరీక్షా ఉత్తీర్ణత సాధిస్తూ ఉంది.

    విజయవాడ - కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

    అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువున్న అలయము. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

    భవాని ద్వీపం
    కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇంతటి ప్రకృతి సోయగాలున్న భవానీద్వీపం ఆలనా పాలనా పట్టించుకోని పర్యాటక శాఖాధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడినా, ఈ ద్వీపాన్ని ప్రైవేటుపరం చేసేందుకు సమాయత్తం అయిన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం ఏడు:-

    తిరువూరు, పెన‌మ‌లూరు, గ‌న్న‌వ‌రం, విజయవాడ పటమట, మైలవరం, నందిగామ మ‌రియు జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం.

    పార్త‌మెంట్ అభ్య‌ర్తులుగా మొద‌టినుంచి గెలిచిన వారా వివ‌రాలు:-
    మొదటి సారి 1952-57లో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందగా, రెండవ సారి 1957-62లో డా. కొమర్రాజు అచ్చమాంబ కాంగ్రెస్ పార్టీనండి గెలుపొందారు. ఇక 1962 నుండి 1977 వ‌ర‌కు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి కేయ‌ల్ రావు గెలుపొంద‌గా ఆరవ సారి 1977-80లో గోడే మురహరి మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. ఏడవ సారి కూడా 1980-84 కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నుపాటి విద్య గెలుపొందారు. ఎనిమిదవ సారి 1984-89 లో వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి గెల‌వ‌గా తొమ్మిదవ సారి 1989-91లో చెన్నుపాటి విద్య కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. పదవ సారి 1991-96లో వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి గెల‌వ‌గా, పదకొండవ సారి 1996-98 లో పర్వతనేని ఉపేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. పన్నెండవ సారి 1998-99లో మ‌ళ్లీ పర్వతనేని ఉపేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి గెల‌వాగా, పదమూడవ సారి 1999-04లో గద్దె రామమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. పద్నాలుగవ సారి 2004-09లో లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంద‌గా, పదిహేనవ సారి కూడా ఆయ‌నే 2009-14లో మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. ఇక పదహారవ సారి 2014-ప్రస్తుతం కేసినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్ల‌మెంట్ అభ్మ‌ర్థిగా కొన‌సాగుతున్నారు.

    రాజ‌కీయం:-
    విజ‌య‌వాడ లోక్ స‌భ ప‌రిదిలో రాజ‌కీయాలు ఎప్పుడూ వాడి వేడిగా జ‌రుగుతుంటాయి. ముఖ్యంగా క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల్లో తీవ్ర పోటీ నెల‌కొంటుంది. క్రిష్ణ జిల్లాలో రాజ‌కీయాలు ఈ రెండు కులాల పై ఆధార‌ప‌డుతుంటుంది. మొద‌టి నుంచి కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వంగ‌వీటి రంగా, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన దేవినేని రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాల్లోనే ఆదిప‌త్య పోరు కొన‌సాగేది. మిగ‌తా కులాల ప్ర‌భ‌వం జిల్లాలో నామ‌మాత్రంగాను ఉంటుంది. క్రిష్ణ జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఉన్న‌ప్ప‌టికి అంత పెద్ద మొత్తంలో లేరు. కాబ‌ట్టి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ సిగ్మెంట్ గాని, క్రిష్న జిల్లా రాజ‌కీయాలు గాని ఎప్పుడూ క‌మ్మ, కాపు సామిజిక వ‌ర్గాల క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిపోతుంటాయి.

    కేసినేని నాని (శ్రీ‌నివాస్ ప్ర‌స్తుత ఎంపి. విజ‌య‌వాడ పార్ల‌మెంట్)
    వ్యాపార‌వేత్త‌గా ఉన్న కేసినేని నాని అలియాస్ శ్రీ‌నివాస్ 2009 వ‌ర‌కూ రాజ‌కీయాల‌వైపు అంత ఆస‌క్తి చూలేదు. చిరంజీవి ప్ర‌జారాజ్యం స్ధాపించిన త‌ర్వాత ఆ పార్టీ లో చేరారు. కొన్నాళ్ల‌కు వ్య‌క్తి గ‌త విభేదాల‌తో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో దేశ వ్యాప్తంగా బ‌స్సులను న‌డిపిన నాని 2014లో అత్యంత ఉత్కంఠ ప‌రిస్థితుల మ‌ద్య టీడిపి అధినేత చంద్ర‌బాబును ఒప్పించి విజ‌య‌వాడ ఎంపీ టికెట్ తెచ్చుకోగ‌లిగారు. తీవ్ర ఒత్తిగిలో ఎంపీ గా గెలుపొందిన ఆయ‌న పార్ల‌మెంట్లో మాట్లాడిన సంద‌ర్బాలు కూడా చాలా త‌క్కువే. కేంద్ర బీజేపితో సంబంధాలు తెంచుకున్న త‌రువాత జ‌రిగిన స‌మావేశాల్లో మాత్రం త‌న గ‌ళాన్ని విప్పారు. ఆంద్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి మోదీ విల‌న్ లా దాపురించాడ‌ని బ‌హాటంగానే విమ‌ర్శించారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీనుంచే ఎంపీగా పోటీ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+