స్కామ్ లు చేసి అడ్డంగా దొరికి బీసీలు అంటారా ? చంద్రబాబుపై మంత్రి అనీల్ ఫైర్
ఏపీలో ఇప్పుడు టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈఎస్ఐ స్కామ్ రాజకీయ దుమారం రేపుతుంది. ఇక తాజా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అనీల్ కుమార్ ఫైర్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా ఇదేం న్యాయమని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చంద్రబాబును ప్రశ్నించారు . చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడితే అదేమిటని ప్రశ్నిస్తే బీసీల పేరు చెప్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ .

అధికారంలో ఉండగా బీసీలు గుర్తుకురాలేదే అన్న మంత్రి అనీల్
నెల్లూరులో పర్యటించిన నీటిపారుదల శాఖ మంత్రి నియోజకవర్గంలో ప్రజల నుండి పలు సమస్యలపై మాట్లాడారు. ఇక ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అచ్చెన్నాయుడు అవినీతిపై, చంద్రబాబు కుల రాజకీయాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చెయ్యటం సిగ్గుచేటు అని ఎద్దేవా చేసిన మంత్రి అనిల్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు అధికారం పోయిన తర్వాతే చంద్రబాబుకు గుర్తువచ్చారా? అంటూ నిలదీశారు.

ఈఎస్ఐ మందుల స్కామ్ లో కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని ఆరోపణ
ఈఎస్ఐ మందుల స్కామ్ లో కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని , ఇక అదేంటి అని అడిగితే కులాల పేరు తెరమీదకు తీసుకువస్తున్నారని పేర్కొన్న మంత్రి అనీల్ తాము కూడా బీసీలమే అని చెప్పారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారని చెప్పారు .అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానకుండా బీసీలపై కేసులు పెట్టినప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించిన అనీల్ కుమార్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు కొట్టేసినప్పుడు బీసీలు గుర్తు రాలేదని ఎద్దేవా చేశారు.

స్కామ్‌లు చేసి అడ్డంగా దొరికి బీసీలు అంటారా అని ఆగ్రహం
స్కామ్‌లు చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత బీసీల జపం చేస్తున్నారని , ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. పోలీసులు ఒక నోటీసు ఇస్తేనే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని అన్నారు. అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు.టీడీపీ నేతలు గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రం పేరును వాడుకోవడం సరికాదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.ప్రతి విషయానికి కులాలు, మతాలు ప్రస్తావన అవసరం లేదని ఆయన అన్నారు. తప్పుడు రాజకీయాలు చేయవొద్దని పేర్కొన్న మంత్రి అనీల్ చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications