విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌలురైతుల కోసం కొత్త చట్టం... కౌలు రైతులకు పక్కా సాయం చేస్తానంటున్న జగన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కౌలు రైతుల భరోసా కోసం కొత్త చట్టం చేసిన జగన్ సర్కార్|AP Assembly Passed Corp Cultivator Rights Bill!

కౌలు రైతుల కష్టాలు తీర్చాలని కౌలు రైతులకు భరోసా ఇవాలని నిర్ణయించిన జగన్ సర్కార్ అసెంబ్లీలో కౌలు రైతుల కోసం కొత్త చట్టాన్ని చేసింది. పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టం చేసి ఈ చట్టంతో భూ యజమానులైన రైతులకు ఎటువంటి నష్టం ఉండబోదని స్పష్టంగా చెప్పింది . రైతుల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా కౌలు రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించే చట్టం అని సీఎం జగన్ పేర్కొన్నారు . అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దీని ద్వారా కౌలు రైతులకు హక్కులు, ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు.

టీడీపీతో జనసేన పొత్తు .. నో ఛాన్స్ బాబు అంటున్న జనసేన టీడీపీతో జనసేన పొత్తు .. నో ఛాన్స్ బాబు అంటున్న జనసేన

కౌలురైతుల కోసం పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టం చేసిన జగన్ సర్కార్

కౌలురైతుల కోసం పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టం చేసిన జగన్ సర్కార్


కొత్త చట్టాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు సీఎం జగన్ . తాజాగా రాష్ట్రంలో కౌలు రైతుల కోసం కీలక చట్టాన్ని తీసుకొచ్చారు జగన్ . పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టంపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని రైతులకు సూచించారు. ప్రస్తుతం రైతు ఫలానా వ్యక్తిని కౌలు రైతు అని చెప్పి ఇవ్వడానికి బయపడే పరిస్థితి నెలకొందని చెప్పి, కౌలు రైతులను గుర్తించడానికి రైతు భయపడుతుండటంతో ఇటు కౌలు రైతు, అటు రైతులు కూడా నష్టపోతున్నారని తెలిపారు. కౌలు రైతులకు మేలు చేసే ఇటువంటి చట్టాన్ని రాష్ట్రంలో మొదటి సారిగా తీసుకువస్తున్నామని ప్రకటించారు. ఈ చట్టం వలన రైతులకు ఎటువంటి అభద్రతాభావం అవసరం లేదని తెలిపారు. స్టాంపు పేపరు ఎంత సులువుగా అందుబాటులో ఉంటుందో, అంతే సులువుగా ఈచట్టం కింద కౌలు రైతు పత్రం అందుబాటులో ఉంటుందన్నారు.

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే కౌలు రైతుల సంక్షేమమ కోసం పెద్ద పీట అని జగన్ ట్వీట్

ఇక ఈ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందాక ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ‘మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కౌలురైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం వర్తించేలా చట్టం తీసుకొచ్చాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 16 లక్షల మంది కౌలురైతులకు ఏటా ఒకొక్కరికి రూ. 12,500 పెట్టుబడి సాయం అందుతుంది'అన్నారు ఏపీ సీఎం జగన్ .

 పంటనష్టం, బీమా , బ్యాంకు రుణాలు సమస్యలకు పరిష్కారం చూపించేలా కౌలు రైతుల కోసం చట్టం

పంటనష్టం, బీమా , బ్యాంకు రుణాలు సమస్యలకు పరిష్కారం చూపించేలా కౌలు రైతుల కోసం చట్టం


జగన్ తీసుకున్న నిర్ణయం చేసిన చట్టం వల్ల కౌలు రైతులకు పంటపై మాత్రమే అది కూడా సంవత్సరంలో 11 నెలల కాలం మాత్రమే హక్కు వుంటుంది. పంటనష్టం జరుగకుండా, బీమా రాకపోవడం, బ్యాంకు రుణాలు లేకపోవడం వంటి కారణాల వలన కౌలు రైతులు నష్టపోతున్నారని , ఇక నుండి అలంటి పరిస్థితి రాకుండా ఈ చట్టం చేసినట్టు తెలుస్తుంది .రెండు వేల జనాభా ఉన్న ప్రతి ఊరి సెక్రటేరియట్‌లో కౌలు రైతు పత్రం లభిస్తుంది. ఈ పత్రంలో ఒక భాగం కౌలు రైతుల గురించి వివరిస్తుండగా, మరో భాగం రైతుల గురించి వివరిస్తుంది. ఈ పత్రంలో భూమి ఎక్కడ ఉంది, ఆ భూమి వివరాలు ఏంటి అనే వివరాలు నింపితే సరిపోతుంది. ఇందులో రైతులు భయపడాల్సినది ఏదీ దు . ఈ పత్రం కేవలం 11నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది ఆ తర్వాత 11 నెలలు దాటితే ఇది చెల్లదని తెలుస్తుంది. వచ్చే సంవత్సరం మళ్లీ పంట కౌలుకు ఇవ్వాలంటే మళ్లీ పత్రం చేయించాల్సిందేనని ఈ చట్టం వలన భూముల మీద ఉన్న హక్కులను రైతు ఏ పరిస్థితుల్లోనూ ఏమాత్రంభూమిని కోల్పోబోడని తెలుస్తుంది . అదే విధంగా కౌలు రైతుకూ ఈ చట్టం వలన ఎంతో మేలు జరుగుతుందని చాలా ఆలోచించే ఈ చట్టం చేసింది జగన్ సర్కార్ .

English summary
The Andhra Pradesh Assembly on Thursday passed the AP Corp Cultivator Rights Bill, 2019 to bestow certain privileges to tenant farmers without affecting the rights of the land owners.Once the new law comes into force, close to 16 lakh tenant farmers would have access to credit from banks, insurance cover besides the Rs 12,500 per annum input assistance from the government.Speaking on the Bill, Chief Minister YS Jagan Mohan Reddy said all benefits including the 'Rythu Bharosa' would be given to the tenant cultivator along with other benefits like bank loans, crop insurance.However, the ownership rights of landowner would not be affected in any way as the tenant farmer would be signing only a 11-month agreement, he added.Hailing the bill, members of the ruling party said it would immensely benefit lakhs of tenant farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X