చంద్రబాబు పాదయ్రాతకు బ్రేక్, పోలీసులతో వాగ్వివాదం, రోడ్డుపై బైఠాయింపు
అమరావతి రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. విషయం తెలిసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మందడం డీఎస్పీ కార్యాలయానికి పాదయాత్రగా బయల్దేరారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను అడ్డుకోవడంతో పోలీసులతో చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు.

చంద్రబాబు పాదయాత్ర
వాస్తవానికి చంద్రబాబు నాయుడు సాయంత్రం పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు. టీడీపీ నేత బోండా ఉమా, సీపీఐ నేత రామకృష్ణ ఇతర నేతలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. అయితే మహిళా రైతుల అరెస్ట్ తెలుసుకొని.. మందడానికి వచ్చేందుకు ర్యాలీగా బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు బృందాన్ని పోలీసులు బెంజ్ సర్కిల్ వద్ద అడ్డుకొన్నారు.

సరికాదు
పోలీసులు అడ్డుకొవడాన్ని చంద్రబాబు టీం తప్పుపట్టింది. తమను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించింది. ఇప్పటికే పాదయాత్ర చేపడుతానని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. మందడంలో తమ కార్యకర్తలను కలిసేందుకు వెళతానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
రోడ్డుపై బైఠాయింపు
ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రను విరమించుకోవాలని చంద్రబాబుకు పోలీసుల సూచించారు. కానీ అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. తమను ముందుకు వెళ్లనీయాలని కోరగా పోలీసులు అంగీకరించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. జేఏసీ చట్ట ప్రకారం స్టేజీ క్యారియర్‌గా రవాణాశాఖ నుంచి అనుమతి తీసుకుందని చంద్రబాబు తెలిపారు. వారికి రాష్ట్రవ్యాప్తంగా తిరిగే హక్కు ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకెళ్లి బస్సుయాత్రను నిలిపివేయడం సరికాదన్నారు.

బస్సుయాత్రకు బ్రేక్
అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్తవానికి జేఏసీ ఆర్టీఏ పర్మిషన్ తీసుకొని బస్సుయాత్ర చేపడుతోంది. కానీ తమ అనుమతి కూడా తీసుకోవాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వెళతారో రూట్‌మ్యాప్ కూడా ఇవ్వమని పోలీసులు అడగడంతో.. బస్సుయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications