విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో వైసిపి కే ఆధిక్యం : 8.2 % ఓట్ల తేడా : రిప‌బ్లిక్ టీవి- సీ ఓట‌ర్ స‌ర్వే సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..ఏపిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే స‌మ‌యంలో తాజాగా రిప‌బ్లిక్ టీవి - సీ ఓట‌ర్ జాతీయ స్థాయిలో ప్ర‌స్తుత ఓట‌ర్ల మూడు్ పై స‌ర్వే చేసింది. జాతీయ స్థాయిలో హంగ్ అని ఇండియా టుడే - కార్వీ స‌ర్వే తేల్చింది. ఇక‌, రిప‌బ్లిక్ టీవీ-సీ ఓట‌ర్ మాత్రం తెలంగాణ‌లో టిఆర్‌య‌స్ కు 16 సీట్లు వ‌స్తాయ ని అంచనా వేసింది. ఇక‌, ఏపిలో వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధిక్యం సాధిస్తుంద‌ని తేల్చింది.

ఏపిలో వైసిపి కే ఆధిక్యం..19 ఎంపీ సీట్లు..

ఏపిలో వైసిపి కే ఆధిక్యం..19 ఎంపీ సీట్లు..

ఏపిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే అంశం పై రిప‌బ్లిక్ టీవీ- సీ ఓట‌ర్ స‌ర్వేను నిర్వ‌హించింది. ఏపిలో ఈ స‌ర్వేలో వైసిపి కి అనుకూల ప‌రిస్థితి కనిపించింది. ఏపిలోని మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో వైసిపి 19 సీట్లు..అధికార టిడిపి 6 సీట్ల‌లో గెలుస్తాయ‌ని అంచనా వేసింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బిజెపి ఒక్క లోక్ స‌భ సీటు కూడా గెల‌వ‌వ‌ని స‌ర్వేలో తేలింద‌ని విశ్లేషించారు. నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ విడుదల చేసింది. ఇక‌, ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్సార్‌సీపీదే పైచేయిగా ఉంది. వైఎస్సార్‌ సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. సీ ఓటర్‌ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది.

చంద్రబాబు నిర్ణయమే ఫైనల్: జగన్ ఎఫెక్ట్... కడప నుంచి పోటీకి వీరిద్దరి వెనుకడుకు ఎందుకు? చంద్రబాబు నిర్ణయమే ఫైనల్: జగన్ ఎఫెక్ట్... కడప నుంచి పోటీకి వీరిద్దరి వెనుకడుకు ఎందుకు?

తెలంగాణ‌లో టిఆర్‌య‌స్ హ‌వా.. 16 సీట్ల‌లో గెలుపు..

తెలంగాణ‌లో టిఆర్‌య‌స్ హ‌వా.. 16 సీట్ల‌లో గెలుపు..

తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జరిగితే టిఆర్‌య‌స్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని స‌ర్వే తేల్చింది. 17 లోక్‌స‌భ స్థానాలు ఉన్న తెలంగాణ‌లో అధికార టిఆర్‌య‌స్ పార్టీ 16 సీట్లు గెలుస్తుంద‌ని..ఎంఐఎం 1 సీటు గెలుస్తుంద‌ని అంచ‌నా వేసింది. ఇక‌, కాంగ్రెస్, బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకొనే ప‌రిస్థితి లేద‌ని తేల్చింది. తాజాగా జ‌రిగిన తెలం గాణ ఎన్నిక‌ల్లో టిఆర్‌య‌స్ 88 స్థానాల్లో గెలిచి ప్ర‌తిప‌క్షాల‌కు షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల పై ఆ పార్టీ దృష్టి సారించింది. ఇదే స‌మ‌యంలో 16 లోక్‌స‌భ స్థానాలు సాధించ‌ట‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ద్వారా కీల‌క భూమిక పోషించాల‌ని చూస్తున్న కేసీఆర్ కు లోక్‌స‌భ సీట్లు ఎక్కువ గెల‌వ‌టం అవ‌స‌రం. తాజాగా ఈ స‌ర్వేలో టిఆర్‌య‌స్ కు అనుకూలంగా ఫ‌లితాలు క‌నిపించాయి.

జాతీయ స్థాయిలో హంగ్ త‌ప్ప‌దా..

జాతీయ స్థాయిలో హంగ్ త‌ప్ప‌దా..

జాతీయ స్థాయిలో ఫ‌లితాల పై ఇండియా టుడే- కార్వీ అదే విధంగా రిప‌బ్లిక్ టీవీ - సీ ఓట‌ర్ నిర్వ‌హించిన స‌ర్వేల్లో ఆస‌క్తి క‌ర ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. రిప‌బ్లిక్ టీవి స‌ర్వే ప్ర‌కారం ఎన్‌డీఏ కూట‌మికి 233, యుపిఏ కు 167, ఇత‌రుల‌కు 143 సీట్లు గా అంచ‌నా వేసారు. ఇక‌, ఇండియా టుడే స‌ర్వేలోల ఎడ‌న్‌డిఏ కూట‌మికి 237, యుపిఏ కు 166, ఇత‌రుల‌కు 140 సీట్లు గా తేల్చారు. 2014 ఎన్నిక‌ల కంటే ఎన్డీఏ 99 సీట్లు కోల్పోతుంద‌ని అంచనా వేసారు. యుపిఏ గతం క‌న్నా 106 సీట్లు ఎక్కువ‌గా గెలుచుకుంటుంద‌ని స‌ర్వేల్లో ఓ అంచ‌నా కు వ‌చ్చారు. దీంతో..కేంద్రంలో హంగ్ త‌ప్ప‌ద‌ని తేల్చింది. అయితే ద‌క్షిణాదిన యుపిఏ పార్టీల‌కే మెజార్టీ స్థానాలు వ‌స్తాయ‌ని స‌ర్వేలో తేలింది. మిగిలిన చోట్ల ఎన్డీఏ అధిక్య‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

English summary
In Republic tv- C voter survey out of 25 Loksabha seats in Andhra Pradesh YCP get 19 and TDP get 6 only. 8.2% vote difference between two parties in AP. Survey declared TRS get 16 seats in Telangana and MIM get one seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X