విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ తొలి దెబ్బ‌తోనే ఇలా.. : క‌ర‌క‌ట్ట వ‌దిలేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం: కొత్త నివాసం ఖ‌రారు...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Shift His House From Undavalli|ఆటోన‌గ‌ర్ స‌మీపంలో గ్రావెల్ ఇండియా భ‌వ‌నంలోకి చంద్ర‌బాబు!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు అనుకున్న‌ది సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ర‌క‌ట్ట మీద నుండి ఖాళీ చేయించాల‌ని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు. ముందుగా చంద్ర‌బాబు త‌న హాయంలో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్ర‌బాబు క‌ళ్ల ముందే కూల్చేసారు. ఇక‌, చంద్ర‌బాబు ఇంటి గురించి జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌ని..నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు ఆ నివాసం లో ఉంటున్నారంటూ ఒక ర‌కంగా చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసాలా చేసారు. దీంతో..గౌర‌వంగా తానే త‌న నివాసాన్ని ఖాళీ చేస్తే మంచిద‌నే అభిప్రాయానికి బాబు వ‌చ్చారు. అంతే కొత్త నివాసం ఖ‌రారు చేసారు. నాలుగు రోజుల్లోగా ఆయ‌న త‌న కొత్త నివాసానికి వెళ్లిపోవాల‌ని డిసైడ్ అయ్యారు.

 క‌ర‌క‌ట్ట వ‌దిలేయనున్న చంద్ర‌బాబు..

క‌ర‌క‌ట్ట వ‌దిలేయనున్న చంద్ర‌బాబు..

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ర‌క‌ట్ట వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా నిర్మించిన నివాసంలో ఉంటూ..నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. ఇక‌, ఇప్పుడు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత జ‌గ‌న్ క‌ర‌క‌ట్ట నిర్మాణాల మీద సంచ‌ల‌న నిర్ణ యాలు తీసుకున్నారు. ముందుగా చంద్ర‌బాబు నిర్మించిన ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉన్న ప్ర‌జా వేదిక‌ను కూల్చివేయా ల‌ని ఆదేశించారు. అంతే..అది గంట‌ల్లో కూలిపోయింది. చంద్ర‌బాబు కంటి ముందే తాను నిర్మించుకున్న భ‌వ‌నం నేల మ‌ట్ట‌మైంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఇక జ‌గ‌న్ త‌న త‌రువాతి అడుగు క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా ఉన్న చంద్ర‌బాబు నివాసం పైనా నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పుకొచ్చారు. అయితే, కోర్టులో దీని పైన కేసు ఉండ‌టంతో అంత సులువుగా త‌న నివాసం పైన నిర్ణ‌యం తీసుకోలేర‌ని పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అయితే, అదే స‌మ‌యంలో ప్ర‌జావేదిక ఉన్న రోడ్డు సైతం రైతు భూమి అని..తాత్కాలిక ప‌ద్ద‌తిన దీన్ని తీసుకున్నార‌ని చెప్ప‌టంతో..ఇప్పుడు ఆ రోడ్డును సైతం ధ్వంసం చేస్తార‌ని చెప్పుకొచ్చారు. దీంతో..చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

విజయ‌వాడ‌కు చంద్ర‌బాబు మ‌కాం..

విజయ‌వాడ‌కు చంద్ర‌బాబు మ‌కాం..

క‌ర‌క‌ట్ట నిర్మాణాల గురించి..తాను అక్ర‌మంగా నిర్మించిన భ‌వ‌నాల్లో ఉంటున్నానే ప్ర‌చారంతో చంద్ర‌బాబు త‌న మ‌న‌సు లో ఆలోచ‌న మార్చుకున్నారు. ఆక్ర‌మించి..నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఇంట్లో ఉంటున్న చంద్ర‌బాబు ఉండాలా లేక ఖాళీ చేయాలా అనే నిర్ణ‌యం ఆయ‌న విజ్ఞ‌తకే వ‌దిలేస్తున్నామ‌ని మంత్రులు వ్యాఖ్యానించారు. దీని పైన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించారు. చంద్ర‌బాబు ఉండాలంటూ కొత్త నివాసాలు.. నూత‌న నివాసం క‌ట్టుకోమంటూ స్థ‌లం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల పైన చ‌ర్చించారు. అయితే, ఇదే స‌మ‌యంలో ఇంకా క‌ర‌క‌ట్ట మీద ఉండ‌టం కంటే విజ‌య‌వాడలో నివాసం ఉంటూ ప్ర‌భుత్వం కొత్త ఇల్లు కేటాయించే వ‌ర‌కూ కొన‌సాగాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అందులో భాగంగా విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్ స‌మీపంలో కామినేని ఆస్ప‌త్రి ఎదురుగా ఉన్న గ్రావెల్ ఇండియా భ‌వ‌నంలోకి త‌న మ‌కాం మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీని పైన ఒక‌టి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్నారు.

జ‌గ‌న్ స‌క్సెస్ అయిన‌ట్లేనా..

జ‌గ‌న్ స‌క్సెస్ అయిన‌ట్లేనా..

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి చంద్ర‌బాబు నివాసం పైన ఆరోప‌ణ‌లు చేస్తున్న జ‌గ‌న్..నేరుగా చంద్ర‌బాబును
లక్ష్యంగా చేసుకోక‌పోయినా..ఇప్పుడు వేసిన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డల ద్వారా చంద్ర‌బాబు ఆయ‌న క‌ర‌క‌ట్ట ఖాళీ చేయా ల్సిన ప‌రిస్థితి తీసుకొచ్చారు. ఇక‌, ఇప్పుడు క‌ర‌క‌ట్ట‌లో ముఖ్య వ్య‌క్తిగా ఉన్న చంద్రబాబును ఖాళీ చేయించే ప‌రిస్థితి తీసుకురావటం ద్వారా..మిగిలిన ప్ర‌ముఖుల‌కు సైతం ప‌రోక్షంగా హెచ్చిరిక జారీ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే, ఇప్ప‌టికే రెవిన్యూ అధికారుల నుండి నోటీసులు అందుకున్న వారికి మ‌రో సారి నోటీసులు జారీ చేయాల‌నేది జ‌గ‌న్ తాజా నిర్ణ‌యంగా తెలుస్తోంది. మూడు భవ‌నాల‌కు మాత్రం అనుమ‌తి ఉంద‌ని చెబుతున్న స‌మ‌యంలో..వీటి పైనా మ‌రోసారి స‌మీక్షించే అవ‌కాశం ఉంది. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ అనుకున్న విధంగా చంద్రబాబును ఎట్ట‌కేల‌కు క‌ర‌క‌ట్ట నుండి పంపించేసారంటూ వైసీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. జగ‌న్ ఒక నిర్ణ‌యం తీసుకుంటే అది ఖ‌చ్చితంగా అమ‌లు చేస్తార‌నే విష‌యం మ‌రో సారి రుజువైంద‌ని చెబుతున్నారు.

English summary
TDP Chief Chandra babu deided to leave Karakatta house to shift Vijayawada. By demolish of Prajavedika by AP Govt and after developments Babu taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X