విజయవాడ పీఎస్‌లో లాకప్‌డెత్ ఘటన - టీడీపీ నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు
అక్రమ మద్యం అనుమానం విజయవాడలో ఓ దళిత యువకుడి ప్రాణం తీసింది. నగరంలోని కృష్ణలంక స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసు స్టేషన్లో అక్రమ మద్యం ఆరోపణలతో తీసుకొచ్చిన అజయ్ అనే దళిత యువకుడు అనుమానాస్పదంగా చనిపోయాడు. పీఎస్‌లో అస్వస్ధతకు గురైన వ్యక్తిని బందరు రోడ్డులోని రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతను చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు.
విజయవాడ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఎస్‌ఈబీ పోలీసులే అజయ్‌ను కొట్టి చంపారని మృతుడి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వివాదాస్పదం కాకుండా చూసేందుకు ఎస్‌ఈబీ పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. లాకప్ డెత్‌పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మాజీ మంత్రి జవహర్, పార్టీ ఎస్సీ సెల్‌కు చెందిన పలువురు నేతలు ఉన్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న మాఫియా వెనుక ఉన్న తిమింగలాలను వదిలేసి సామాన్యులన ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లు మద్యం తరలిస్తూ పట్టుబడినా చర్యలు లేవని, సామాన్యులను మాత్రం వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. మద్యం తయారీ దారుల నుంచి సరఫరా దారుల వరకూ అందరూ వైసీపీలోనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. మద్యం ధరలను 90 శాతం పెంచడం వల్ల ఓవైపు కల్తీ మద్యం, మరోవైపు అక్రమ మద్యం ఏరులై పారుతోందని ఆయన ఆరోపించారు.
Recommended Video
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications