జగన్ ట్రాప్‌లో చిక్కుకునే.. పవన్‌తో కలిసి ఉంటే గెలిచేవాళ్లం:చంద్రబాబుతో కాపు నేతలు..!
టీడీపీ కాపు నేతలు అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. మనసులోని ఆవేదనను ఓపెన్‌గా చెప్పేసారు. కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వాపోయారు. లోకేశ్ తీరు మీద ఫిర్యాదు చేసారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. పార్టీని తానే చూస్తున్నానని..ఎవరితోనూ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పొరపాట్లను సరిదిద్దుకుందామని ..కలిసి పని చేద్దామని సూచించారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి మీద చర్చ సాగింది. జగన్ ట్రాప్‌లో చిక్కుకున్నాం .. పవన్‌తో కలిసి పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్లం.. ఆర్దికంగా వైసీపీ డామినేట్ చేసిందని వివరించారు. టీడీపీలోనే కొనసాగుతామని కాపు నేతలు హామీ ఇచ్చారు.

పవన్‌తో కలిసి ఉంటే గెలిచేవాళ్లం..
తాజా ఎన్నికల్లో ఓటమికి కారణాల పైన టీడీపీ కాపు నేతలు పార్టీ అధినేత ముందు ఓపెన్ అయ్యారు. కాకినాడలో సమావేశమైన టీడీపీ కాపు నేతలు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయనతో భేటీ అయి..అనేక విషయాలను చర్చకు తెచ్చారు. ఎన్నికల సమయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ సమర్ధవంతంగా పని చేయలేదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో సంబంధం లేని కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని అధినేత దృష్టికి తీసుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా గెలిచే వాళ్లమనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ముద్రగడ ఉద్యమం పేరుతో పోలీసులు కాపు వర్గానికి చెందిన వారి పైన చేసిన నిర్బంధం సైతం టీడీపీ మీద వ్యతిరేక భావం చూపించిందని వాపోయారు. కాపుల్లో సమర్ధులైన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని..ఇచ్చిన వారు పార్టీ కోసం పని చేయాలేదని అధినేత ముందు ఖరా ఖండిగా చెప్పేసారు. పవన్ కళ్యాణ్ టీడీపీ మీద చేసిన విమర్శలు పార్టీ మీద కాపుల్లో వ్యతిరేక ప్రభావం చూపించాయని కాపు నేతలు అభిప్రాయపడ్డారు.

జగన్ ట్రాప్‌లో చిక్కుకునే..
వైసీపీ అధినేత జగన్ ట్రాప్‌లో చిక్కుకున్నామనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అయింది. బీజేపీతో దూరం అవ్వ టానికి ..పవన్ కలవకపోవటానికి కారణం జగన్ అని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేసారు. పవన్..టీడీపీ ఒకటే అంటూ జగన్ విమర్శలు చేయటం ద్వారా జనసేన అధినేత టీడీపీతో దూరం పాటించారని.. టీడీపీ నేతలు సైతం పవన్ మీద చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపించాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. కాపులతో పాటుగా బీసీల్లో సైతం నమ్మకం కలిగించటంలో విఫలమయ్యామని నేతలు స్పష్టం చేసారు. ఇక, ఆర్దికంగా వైసీపీ బలంగా కనిపించిందని .. ప్రతిపక్షంలో ఉండి వారు చేసిన ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ అధికారంలో ఉండి చేయలేక పోయామని తేల్చి చెప్పారు. లోకేశ్..నారాయణ వంటి వారిని ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు వినియోగించకుండా వారిని సైతం ఎన్నికల బరిలోకి దింప టం వలన నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రచారంలోనూ లైన్ తప్పామనే భావన నేతల్లో వ్యక్తం అయింది.

లోకేశ్ నష్టం చేసారు..చంద్రబాబుతోనే ఉంటాం..
ఇదే భేటీలో కాపు నేతలు లోకేశ్ పైనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లోకేశ్ దగ్గర ఉండే వ్యక్తుల వ్యవహార శైలి కారణంగా పార్టీకి నష్టం జరిగిందని నేతలు వివరించారు. అదే విధంగా గోదావరి జిల్లాలో కాపు వర్గానికి చెందిన అభ్యర్దు లకు ఆర్దికంగా తోడ్పాటు లభించలదేని..మరో ముఖ్య వర్గానికి చెందిన వారికి ఆర్దికంగా సాయం అందిందని నేతలు ఫిర్యాదు చేసారు. అయితే, తాను పార్టీ బాధ్యతలు చూస్తున్నానని..కొన్ని పొరపాట్లు జరిగాయని..వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. తాము పార్టీ వీడే ఆలోచన లేదని..పార్టీలోనే ఉంటామని కాపు నేతలు స్పష్టం చేసారు. అదే సమయంలో సామాజికవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయవద్దని చంద్రబాబు వారికి సూచించారు. మొత్తం మీద కాపు నేతలు మనసు విప్పి మాట్లాడటం..చంద్రబాబు సైతం పొరపాట్లు అంగీకరించి భవిష్యత్ మీద హామీ ఇవ్వటంతో సమస్య ప్రస్తుతానికి సమిసిపోయినట్లుగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications