కృష్ణా జిల్లాలో మరో నేత దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసిన దుండగులు...
కృష్ణా జిల్లాలో ఇటీవల మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు,వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరకవముందే అదే జిల్లాలో మరో నేత హత్యకు గురయ్యాడు. అవని గడ్డ నియోజకవర్గంలోని నాగాయలంకలో టీడీపీ నేత తాతా సాంబయ్య(35)పై బుధవారం(జూలై 1) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు.
నాగాయలంక నుంచి తాను నివాసం ఉండే పెదగౌడపాలెం గ్రామానికి సాంబయ్య బైక్‌పై వెళ్తుండగా... మార్గమధ్యలో దుండగులు అడ్డగించారు. ఆపై కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. దీంతో సాంబయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాంబయ్య పర్రచివర గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ బరిలోనూ దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

కాగా,రెండు రోజుల క్రితం రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మేకా భాస్కర్ రావు హత్యతో మచిలీపట్నం ఉలిక్కిపడ్డ సంగతి తెలిసిందే. భాస్కరరావుపై దుండగులు పక్కా వ్యూహంతోనే దాడి చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.మోకాను వెంబడించి, కత్తులతో దాడి చేసిన దుండగులుప్రధాన రహదారిలోని డివైడర్‌కు ఉన్న చిన్న దారి నుంచి పరారైనట్లు గుర్తించారు.డీఎస్పీ మెహబూబ్ బాషా, సీఐలు కడలి వెంకటేశ్వరరావు, రవి నేత్రుత్వంలోని పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications