ఏపీలో డ్రామా..పుదుచ్చేరిలో ప్రేమ అంటే కుదరదు ఆర్టిస్ట్ నాని : పుదుచ్చేరి హోదాపై అయ్యన్న అస్త్రం
పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ ఆంధ్ర రాష్ట్రంలో బిజెపిని టార్గెట్ చేయడానికి మాత్రమే కాదు వైసీపీని టార్గెట్ చెయ్యటానికి టీడీపీకి ఆయుధంగా మారుతుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ పేర్కొన్న బిజెపి ఇప్పుడు పుదుచ్చేరి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దుమారం మొదలైంది.
Recommended Video

హోదాపై తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డి నిలదీయాలని పేర్ని నానీకి అయ్యన్న హితవు
బిజెపి మిత్ర పక్షాలకు మద్దతుగా పుదుచ్చేరిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం కూడా టిడిపి నేతలకు ఆయుధంగా మారింది. అటు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బిజెపి ని , ఇటు తీసుకురా లేకపోయిన వైసీపీ ని టార్గెట్ చేస్తూ టిడిపి నేతల విమర్శల పరంపర కొనసాగుతోంది.
తాజాగా వైసిపి నేతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు గుప్పించారు . రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం ఆపి తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డి నిలదీయాలని టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

రాష్ట్రంలో పేర్ని నాని ఒక కామెడీ పీస్, బీజేపీపై రంకెలు వేస్తున్నట్టు నటించటం కాదని ఎద్దేవా
రాష్ట్రంలో పేర్ని నాని ఒక కామెడీ పీస్ లా తయారయ్యారని విమర్శించారు. పుదుచ్చేరికి హోదా ప్రకటించిన బీజేపీపై రాష్ట్రంలో రంకెలు వేస్తున్నట్టు నటించటం కాదని , నేరుగా తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డిని నిలదీయాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఇక్కడ బిజెపిని తిట్టి పోస్తూ , అక్కడ బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలని పుదుచ్చేరి లో వైసీపీ మంత్రులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో నిలదీయాలని పిలుపునిచ్చారు . ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేక హోదా, పుదుచ్చేరిలో మాత్రం ఎలా మొదలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

ఏపీలో డ్రామా.. పుదుచ్చేరిలో ప్రేమ అంటే కుదరదు : ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ
ఏపీలో డ్రామా.. పుదుచ్చేరిలో ప్రేమ అంటే కుదరదు ఆర్టిస్ట్ నాని అని సోషల్ మీడియా వేదికగా అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే పుదుచ్చేరికి ప్రత్యేక ప్రత్యేక హోదా అంశంపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు . రాష్ట్రంలో బీజేపీతో రహస్య ప్రయాణాన్ని కట్టి పెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రులు గెలుపు కోసం వైసీపీ నాయకులతో విస్తృత ప్రచారం చేస్తున్నారు వైఎస్ జగన్. కేసుల గురించి కాకుండా కాస్త ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి అంటూ పుదుచ్చేరికి హోదా ఇస్తామన్న అంశాన్ని టార్గెట్ చేసి విమర్శించారు .

జగన్ ను టార్గెట్ చెయ్యటానికి పుదుచ్చేరి హోదా .. టీడీపీ పాశుపతాస్త్రం
ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రత్యేక హోదాను జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని , హోదా తీసుకురా లేని గొర్రెలు వైసీపీ ఎంపీలు అని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఏదైనా ప్రత్యేక హోదా అంశం మాత్రం చాలా కాలంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారాస్త్రం . ఇప్పుడు పుదుచ్చేరిలో ప్రత్యేక హోదా అంశాన్ని బిజెపి తెరమీదకు తీసుకురావడంతో టిడిపి నాయకులకు ఇది ఒక ఆయుధంగా మారింది.
బీజేపీకి ఈ పరిణామం ఇబ్బంది కాగా , వైసీపీ మంత్రులను, జగన్ ను టార్గెట్ చెయ్యటానికి పాశుపతాస్త్రంగా టీడీపీ దీన్ని వాడుతోంది .












Click it and Unblock the Notifications