ysrcp murder case tdp krishna district machilipatnam AP Municipal Election Results 2021 వైసీపీ టీడీపీ బహిష్కరణ కృష్ణా జిల్లా మచిలీపట్నం politics
బందరులో సంచలనం -చింతా చిన్ని జిల్లా బహిష్కరణ -మోకా భార్య మేయరైన మరునాడే -‘జగనన్న’ మార్కు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్ల ఎంపికలో అత్యంత వ్యూహాత్మక వ్యవహరించడం, పీడిత వర్గాలకు పాలనా పగ్గాలు, అక్కచెల్లెమ్మలకు లెక్కకు మించిన పదవులు అంటూనే పనిలో పనిగా 'ప్రతీకార' ఎంపిలకూ ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మచిలిపట్నం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యోదంతం తర్వాత, ఆయన భార్య వెంకటేశ్వరమ్మకు బందరు మేయర్ పీఠాన్ని అప్పగించింది వైసీపీ హైకమాండ్. ఇది జరిగి 24 గంటలైనా తిరక్కముందే.. బందరులో మరో సంచలనం చోటుచేసుకుంది..
జగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలు

చింతా చిన్నికి బహిష్కరణ
మంత్రి పేర్ని నానికి ముఖ్యఅనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసుకు సంబంధించి మరో పరిణామం చోటుచేసుకుంది. మోకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ నేత చింతా చిన్నికి వైసీపీ సర్కారు భారీ షాకిచ్చింది. చింతా చిన్నిని కృష్ణా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. చింతా చిన్నిపై జిల్లా బహిష్కరణ ఆరు నెలలపాటు అమలులో ఉంటుదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోకా హత్యకేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా,
MLC Election Results 2021: కారు జోరు -పల్లా, వాణిదేవికే తొలి ప్రాధాన్యం -తాజా ఫలితాలివే..

మోకా భార్య మేయరైన మరునాడే..
గతేడాది మోకా భాస్కర్ రావు హత్య తర్వాత మచిలీపట్నంలో వైసీపీ, టీడీపీ మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజా మున్సిపల్ ఎన్నికల్లో మోకా భార్య వెంకటేశ్వరమ్మను వైసీపీ 23వ డివిజన్ లో నిలబెట్టగా, భాస్కర్ రావు హత్య కేసులో ప్రధాని నిందితుడైన చింతా చిన్ని సైతం అదే డివిజన్ లో టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగి ఓడిపోయాడు. పార్టీ పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యర్థిపై గెలుపొందిన వెంకటేశ్వరమ్మకు బందరు తొలి మేయర్ గా వైసీపీ హైకమాండ్ అవకాశం కల్పించింది. గురువారమే ఆమె మేయర్ గా బాధ్యతలు చేపట్టగా, మరుసటిరోజే చింతా చిన్నిని జిల్లా నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు వెలువడటం గమనార్హం. కాగా, కలెక్టర్ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున చిన్నిపై జిల్లా బహిష్కరణ విధించినట్లు ప్రకటించారు. కోర్టు ఆర్డర్‌తో ఇటీవల ఎన్నికల కోసం చింత చిన్ని మచిలీపట్నం వచ్చారు. ఎన్నికల అనంతరం తిరిగి జిల్లా కలెక్టర్ బహిష్కరించారు.

భర్త ఆశయాల సాధనలో..
మచిలీపట్నం మేయర్ గా ఎంపికైన తర్వాత మోకా వెంకటేశ్వరమ్మ కీలక ప్రకటన చేశారు. ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తానని, నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తూ ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తానని, సీఎం జగన్, మంత్రి పేర్ని నాని, కార్పొరేటర్ల ఆశీస్సులతో ఈ గురుతర బాధ్యతను చేపట్టానని అన్నారు. బీసీ వర్గానికి చెందిన ఒక మహిళకు ఇంత అగ్రస్థానం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, తన భర్త దివంగత మోకా భాస్కరరావు ఆశయాల మేరకు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడతానని ఆమె చెప్పారు. బందరులో పరిణామాలపై..

జగనన్న మార్కు ప్రతీకారం!
మచిలీపట్నం మేయర్ గా మోకా వెంకటేశ్వరమ్మ ఎంపిక, ఆ మరునాడే చింతా చిన్ని జిల్లా బహిష్కరణ జరగడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. మోకా కుటుంబానికి న్యాయం చేస్తానని జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని, గత టీడీపీ హయాం మాదిరిగా కాకుండా చట్ట పరిధిలోనే తన వాళ్ల తరఫున ప్రతీకారం తీర్చుకున్నాడని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. కాగా, టీడీపీ శ్రేణులు మాత్రం చిన్ని బహిష్కరణను రాజకీయ కక్షసాధింపుగానే భావిస్తున్నాయి. జగన్ నిజంగా సోదరీమణులను ఆదరించేవారైతే షర్మిలకు, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతలకు ఏనాడో న్యాయం దక్కి ఉండేదని టీడీపీ వర్గాలు కౌంటరిస్తున్నాయి..