• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కృష్ణా జిల్లా రాజకీయాల్లో మళ్లీ నవ "వసంత"0...! రెండు దశాబ్దాల తర్వాత తెరపైకి వసంత కుటుంబం..!!

|

అమరావతి/హైదరాబాద్ : కృష్ణ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకన్నా భిన్నంగా సాగుతుంటాయి. ఆ జిల్లాలో ఏ ఎన్నిక ననై రాజకీయ నేతలు ప్రతష్టాత్మకంగా తీసుకుంటారు. రాజకీయ రాజ‌కీయాల‌కు వేదిక‌లు కృష్ణా, గుంటూరు జిల్లాలు. పార్టీలుమారినా రాజ‌కీయాలు మాత్రం అలాగే ఉంటాయి. ప‌క్కనే ఉంటూ బ‌ల్లెంలా పొడ‌వ‌గ‌ల దిట్టలు. చాతుర్యం చూప‌గ‌ల స‌మ‌ర్థులు. ఇదంతా రాజ‌కీయాల్లో భాగ‌మే. అక్కడ నెగ్గాలంటే మంచిచెడులుండ‌వు.. స‌మ‌ర్థత‌.. అస‌మ‌ర్థులు క‌నిపించ‌రు. కేవ‌లం తాము ముందుకు ప‌రుగెత్తేందుకు ఏది అవ‌స‌ర‌మో దాన్నే అనుస‌రిస్తారు. ఇప్పుడెందుకీ చ‌ర్చ అంటే.. రెండున్నర ద‌శాబ్దాల త‌రువాత‌.. కృష్ణాజిల్లాలో మ‌రోసారి వ‌సంత నాగేశ్వర‌రావు తెర‌వెనుక రాజ‌కీయం చేస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నారు.

కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు..! సుధీర్గ కాలం తర్వాత చక్రం తిప్పుతున్న వసంత కుటుంబం..!!

కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు..! సుధీర్గ కాలం తర్వాత చక్రం తిప్పుతున్న వసంత కుటుంబం..!!

ఎన్‌టీఆర్ హ‌యాంలో హోంమంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న కాంగ్రెస్‌లో వ్యవ‌సాయశాఖ కూడా చేప‌ట్టారు. ఆ త‌రువాత క్రమంగా నందిగామ‌, జ‌గ్గయ్యపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్తనెత్తురు రావ‌టంతో పాత‌త‌రం వెనుక‌బ‌డింది. అలా.. నాలుగుసార్లు సీటిచ్చినా గెల‌వ‌లేక ఢీలాప‌డిన నేత‌ల్లో వ‌సంత కుటుంబం కూడా ఒకటి. తండ్రి వ‌సంత నాగేశ్వరావు, త‌న‌యుడు వ‌సంత కృష్ణప్రసాద్ ఇద్దరూ ఓట‌మి ప‌రాభ‌వం నుంచి తాజాగా మైల‌వ‌రంలో కృష్ణప్రసాద్ గెలుపు ద్వారా బ‌య‌ట‌ప‌డ్డారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. దేవినేని కుటుంబంపై పై చేయి సాధించేందుకు వ‌సంత తీవ్రప్రయ‌త్నాలు చేస్తున్నారు.

దేవినేని శకానికి చెక్..! బలమైన నేతగా వ‌సంత కృష్ణప్రసాద్..!!

దేవినేని శకానికి చెక్..! బలమైన నేతగా వ‌సంత కృష్ణప్రసాద్..!!

దీనిలో భాగంగానే జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల‌తో చాలా ద‌గ్గర‌గా మెలుగుతున్నారు. ఇద్దర‌కు మంత్రి ప‌ద‌వులు ఇప్పించ‌టంలో కీల‌కంగా వ‌సంత వ్యవ‌హ‌రించార‌నే గుస‌గులు కూడా వినిపించాయి. అదే స‌మ‌యంలో తానంటే. గిట్టని ఒక‌రిద్దరు వైసీపీ ఎమ్మెల్యేల‌కు పార్టీలో ఇమేజ్ త‌గ్గించేందుకు త‌న వంతు ప్రయ‌త్నం కూడా చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇది నిజ‌మా కాదా అనేది ప‌క్కన‌బెడితే.. వ‌సంత కృష్ణప్రసాద్ నందిగామ‌లో జ‌రిగిన ఓ హ‌త్యకేసులో నిందితుడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో న‌డుస్తూనే ఉంది.

ప్రజలకు అందుబాటులో వసంత ఫామిలీ..! మళ్లీ తెలరపైకి పెద్దాయన..!!

ప్రజలకు అందుబాటులో వసంత ఫామిలీ..! మళ్లీ తెలరపైకి పెద్దాయన..!!

ఆ స‌మ‌యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోని ఓ కీల‌క నేత దీనికి కార‌ణ‌మ‌నే భావ‌న వ‌సంత కుటుంబంలో ఉంద‌ట‌. దీంతో త‌మ‌ను ఆ నాడు ఇబ్బందికి గురిచేసిన వారికి గుణ‌పాఠం చెప్పాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. త‌మ‌ను రాజ‌కీయంగా దెబ్బతీసిన ఎవ్వరినీ వ‌ద‌లమ‌ని వ‌సంత ఆల్రెడీ అనుచ‌రుల వ‌ద్ద చెబుతున్నార‌ట‌. ఈ లెక్కన‌.. వైసీపీలో అంత‌ర్గత పోరు ఇప్పటికే మొద‌లైంద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి.. ఈ రాజ‌కీయాల‌ను జ‌గ‌న్ ఎలా నెగ్గుతార‌నేది చ‌ర్చనీయాంశంగా మారింది.

ఛాంబర్లలోకి మంత్రులు..! పాలన స్పీడందుకున్నట్టే..!!

ఛాంబర్లలోకి మంత్రులు..! పాలన స్పీడందుకున్నట్టే..!!

రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రిని అభినందించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, అభిమానులు తరలివచ్చారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు పాసులు మూడు సంవత్సరాలకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కొత్త వాహనాలు కొనుగోలు సమయంలో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈనెల 13వతేదీ నుంచి ఫిట్‌నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటిదాకా 357 బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ చేయించని వాహనాల వివరాలు ప్రజల ముందు ఉంచుతామని వివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vasantha Nageshwar Rao, who served as Home Minister during the NTR period, also held the agenda of the Congress. Subsequently the old generation lagged behind with the emergence of new constituencies in Nandigama and Jaggayapet constituencies. The Vasantha family was one of the leaders who had lost four times. Father Vasantha Nageshrao and his brother Vasantha Krishnaprasad both lost their losers in the latest milestone.but in the latest elections Vasantha Krishnaprasad showed his makr and won against devineni Uma in mylavaram constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more