మాలోకానికి అలవాటే.. పుట్టుకతో వచ్చిన బుద్ది అదీ: సాయిరెడ్డి
ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. యువనేత నారా లోకేశ్‌పై మంత్రులు, కీలక నేతలు కామెంట్లు చేస్తున్నారు. వారిపై టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. వైసీపీ వాళ్లను అసభ్య పదజాలంతో దూషించడం టీడీపీ నేత నారా లోకేశ్ కు అలవాటేనని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. నారా లోకేశ్‌కు అది పుట్టుకతో వచ్చిన సమస్య అని విమర్శించారు. టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోందని అన్నారు.
లోకేశ్ నిన్న నిర్వహించిన జూమ్ మీటింగ్‌కు 'కంసమామ జగన్' అని పేరు పెట్టారని మండిపడ్డారు. ఇంత జుగుప్సాకరమైన పనులు చేస్తున్నారు కాబట్టే... ప్రశ్నించడానికి జూమ్ మీటింగ్‌లోకి తమ పార్టీకి చెందినవారు వెళ్లారని చెప్పారు. తండ్రీకొడుకులు బుద్ధి మార్చుకోవాలని సూచించారు. లేదంటే తామే తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.

నిన్న జరిగింది కేవలం ఆరంభం మాత్రమేనని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఎదురుదాడి చేస్తామని చెప్పారు. పదో తరగతిలో విద్యార్థులు ఎందుకు ఫెయిలయ్యారో తెలుసుకోవాలని సూచించారు. కానీ సీఎం జగన్‌ను తిట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చర్చకు రావాలని లోకేశ్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు. చర్చకు రావాలని ఆయనను కోరుతున్నానని చెప్పారు. ఇదే విషయంపై చర్చకు చంద్రబాబు వచ్చినా తాము సిద్ధమేనని అన్నారు.
ఇటీవల విడుదలయిన పదో పరీక్ష ఫలితాల్లో 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. రిజల్ట్ విడుదల చేసే తేదీ వాయిదా పడటం.. ఆ తర్వాత రిలీజ్ చేయడంతో అనుమానాలకు కారణమైంది. తర్వాత ప్రభుత్వం మేల్కొని సప్లిమెంటరీ రాసి పాయిసన విద్యార్థులను రెగ్యులర్‌గా పరిగణిస్తామని చెప్పింది. అమ్మ ఒడి పథకం కోసం ఇంతమందిని ఇలా ఫెయిల్ చేశారా అని విపక్షాలు ఆరోపించాయి.












Click it and Unblock the Notifications