వంగవీటి రాధాపై రెక్కీ: ఆధారాలు దొరకలేదు; తప్పుడు ప్రచారం చేస్తే.. విజయవాడ సీపీ వార్నింగ్
విజయవాడ రాజకీయాలలో వంగవీటి రాధాను హత్య చేయడం కోసం కుట్ర జరిగిందని, వంగవీటి రాధా పై రెక్కీ నిర్వహించారని స్వయంగా ఆయనే ప్రకటించడం సంచలనంగా మారింది. అప్పటినుండి వంగవీటి రాధా వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది .ఇక తాజాగా వంగవీటి రాధాను హత్య చేయడం కోసం రెక్కీ నిర్వహించారన్న అంశంపై విజయవాడ సి పి క్రాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడారు.

రాధా రెక్కీ పై నిర్దిష్ట ఆధారాలు దొరకలేదు
టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను హత్య చేయడం కోసం రెక్కీ నిర్వహించారన్న విషయంపై ఇంకా నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన పై తప్పుడు ప్రచారం చేస్తే, శాంతిభద్రతలు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా వెల్లడించారు. రెక్కీ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వంగవీటి రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని వెల్లడించారు.

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఇప్పటివరకు వంగవీటి రాధాకు సంబంధించి హత్య కుట్ర జరిగిందని, రెక్కీ నిర్వహించారన్న దానిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీపీ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు. అయినప్పటికీ రెండు నెలల సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని విజయవాడ సిటీ క్రాంతి రానా టాటా వివరించారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు .ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసేవారికి వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగినా కఠినంగా వ్యవహరిస్తామని విజయవాడ సిపి క్రాంతి రానా టాటా స్పష్టం చేశారు.

విజయవాడలో వంగవీటి రాధా హత్య కుట్ర దుమారం
ఇదిలా ఉంటే వంగవీటి రాధా పై హత్యకు కుట్ర జరిగిందన్న వ్యవహారం విజయవాడ రాజకీయాల్లో దుమారంగా మారింది. టిడిపి నేతలు వంగవీటి రాధా పై హత్యకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా నిమ్మల రామానాయుడు 1989లో వంగవీటి రంగా హత్య చేసి కాపు, కమ్మ కులాల మధ్య విద్వేషాలు రగిల్చి నాడు అధికారంలోకి వచ్చినట్టుగా, వంగవీటి రాధాను హత్యచేసి కుల విద్వేషాలను రెచ్చగొట్టి వచ్చే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని వైసిపి హత్య రాజకీయాలకు తెర తీసిందని అన్నారు.
Recommended Video

అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం .. రాధా వ్యవహారంపై సీపీ స్పందన
వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించిన అరవ సత్యం వైసిపి నాయకుడని, ఇదంతా జగన్ వల్లనే అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. ఇక ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ చేస్తున్నారు. మరోపక్క ఇటీవల రాధ ఆఫీస్ ముందు ఒక స్కూటీ అనుమానాస్పదంగా అనిపించటంతో రాధా అనుచరులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ స్కూటీ ఎవరిదో నిర్ధారించిన పోలీసులు భయపడాల్సింది ఏమీ లేదన్నారు. తాజాగా రాధాకు ప్రాణ హాని పొంచి ఉందని చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారం పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications