విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులకు ఇంటికే మందుల పంపిణీ- విజయవాడలో రైల్వేశాఖ ప్రయోగం...

|
Google Oneindia TeluguNews

విజయవాడలో రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలు ఇస్తోంది. డివిజన్ పరిధిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు కేవలం వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే ఇంటివద్దకే మందులు పంపిణీ పంపే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇళ్లు దాటి బయటకు రాలేని దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు, వారికుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తోంది.

vijayawada division delivers medicines to employees door step

విజయవాడ డివిజన్ పరిధిలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకుంటూ రైల్వే ఆస్పత్రి నుంచి ఉద్యోగులకు మందుల పంపిణీ చేపడుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 640 మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ సేవను వినియోగించుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. డివిజన్ పరిధిలో పనిచేస్తున్న 1850 మంది ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

vijayawada division delivers medicines to employees door step

విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగులు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో 7569305668, 7675928721 & 7569305636 నంబర్లకు, మంగళ, గురు, శనివారాల్లో 7673927677, 7569305620 & 7013826171 నంబర్లకు మెడికల్ ఐడీ కార్డు, డాక్టర్ సలహా పత్రం, ఫోన్ నంబరు, ప్రస్తుత అడ్రస్, కావాల్సిన మందుల వివరాలు పంపితే అధికారులు వారికి ఇంటికే పంపుతున్నారు.

English summary
Railway Hospital, Vijayawada successfully delivers monthly OPD medicines to 1850 employees & pensioners at their Door step. Scouts & Guides of Vijayawada Division distribute medicines to 640 beneficiaries in 4 Days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X