విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2024లో పోటీపై కేశినేని నాని క్లారిటీ ! చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ! టాటా అండతోనే !

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో విజయవాడ పాలిటిక్స్ కు ఉన్న ప్రత్యేకత వేరు. ఇక్కడ వరుసగా రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఈ మధ్య కాలంలో సొంత పార్టీలోనే తీవ్ర ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. దీంతో ఓవైపు టీడీపీతోనూ, మరోవైపు బీజేపీతో సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. తన సోదరుడు కేశినేని చిన్ని రాక తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన పోటీతో పాటు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు.

కేశినేని నాని కామెంట్స్

కేశినేని నాని కామెంట్స్

విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన సోదరుడు కేశినేని నాని దూసుకొస్తున్న తీరు, విజయవాడ ఎంపీ సీటులో పోటీ, నగరంలో చేసిన అభివృద్ధి.. ఇలా పలు అంశాలపై తన అభిప్రాయాల్ని నాని కుండబద్దలు కొట్టేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నాని పోటీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. అలాగే టీడీపీలో ఆయన పరిస్ధితి ఏంటన్న దానిపైనా స్పష్టత వచ్చింది. సోదరుడు చిన్నితో వైరం కారణంగా నాని భవిష్యత్ వ్యూహాలు ఎలా మారుతున్నాయన్న దానిపైనా ఆయన తాజా వ్యాఖ్యలు క్లారిటీ ఇస్తున్నాయి.

 చిన్నితో పోటీనా ?

చిన్నితో పోటీనా ?

సోదరుడు కేశినేని చిన్నితో తనను మీడియా పోల్చడాన్ని కేశినేని తప్పుబట్టారు. ఢిల్లీ స్థాయి నాయకుడిని అయిన తనను మీడియా గల్లీ స్థాయిలో చూపించాలని చూస్తోందన్నారు. నిస్వార్థంగా పని చేసే వాళ్ళు ఎవరూ మనుషులను చంపి వార్తల్లోకి ఎక్కరన్నారు. ప్రజలకు దానం చేసే వాడు సైలెంట్ గా చేస్తాడని, రతన్ టాటా ఎన్ని మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నాడా అని సూటి ప్రశ్న వేశారు. ఫౌండేషన్లు , ట్రస్ట్ లు ఎన్నికల ముందు వచ్చేవే ఎన్నికల అనంతరం కనపడవన్నారు. ఎవరో చీరలు, ట్రై సైకిళ్లు పంచితే దాన కర్ణులు అవ్వరని, వారి ప్రయోజనాల కోసం పార్టీలో నలుగురికీ డబ్బు ఇచ్చి జిందాబాద్ లు కొట్టించుకుంటారన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించా అయినా విజయవాడ అభివృద్ధి చేశా.. దటీజ్ కేశినేని నాని అన్నారు.

 రతన్ టాటాయే స్నేహితుడు

రతన్ టాటాయే స్నేహితుడు

భారత దేశంలో ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ లో బస్సుల వ్యాపారం లో చక్రం తిప్పిన తాను ఓ అవినీతి అధికారి అన్న మాటకు వ్యాపారం వదులుకున్న చరిత్ర తనదని కేశినేని నాని తెలిపారు. దేశంలో తాను చేసినన్ని పనులు ఏ ఎంపీ చేయలేదని కేశినేని నాని తెలిపారు. లగడపాటి దుర్గ గుడి ఫ్లైఓవర్ అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపించానని కేశినేని తెలిపారు. రతన్ టాటా తన స్నేహితుడని, అది చాలని కేశినేని పేర్కొన్నారు. రతన్ టాటా నన్ను అభిమానించే వ్యక్తి అని, తాను ఏది చేయమంటే అది చేస్తాడని కేశినేని తెలిపారు.

ఇండిపెండెంట్ గా పోటీ ?

ఇండిపెండెంట్ గా పోటీ ?

విజయవాడలో ఎంపీగా మరోసారి పోటీకి సంబంధించి తాజాగా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేయనని ఎప్పుడూ చెప్పలేదని, పోటీ చేయననే వీడియో ఉంటే చూపించండి అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. తాను పోటీ చేయాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తారన్నారు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించారు. తద్వారా టీడీపీ ఎంపీగా తనకు టికెట్ రావడం లేదనే విషయాన్ని కేశినేని స్పష్టం చేసినట్లయింది. అంతే కాదు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా రతన్ టాటా సహకారంతో తాను చేసిన పనుల ఆధారంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తాననే ధీమాను నాని వ్యక్తం చేశారు.

English summary
vijayawada tdp mp kesineni nani has made sensational comments on his contest in 2024 eletions and brother chinni's politics against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X