పులివెందులకు పిల్లిలా.. సత్య ప్రమాణం ఎందుకు చేయలే, జగన్‌పై లోకేశ్ నిప్పులు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఏ సంబంధం లేదనే తిరుమల వెంకన్న సాక్షిగా తాను ప్రమాణం చేశానని లోకేశ్ చెప్పారు. అదేవిధంగా జగన్ చేయాలని సవాల్ విసిరారు. జగన్ కుటుంబానికి సంబంధం లేదని వెంకన్నపై ప్రమాణం చేయాలని తాను విసిరిన ఛాలెంజ్‌కు జగన్ భయపడ్డారని చెప్పారు. అందుకోసమే పులివెందులకు పిల్లిలా పారిపోయాడని చెప్పారు.
వివేకానంద మర్డర్ మిస్టరీ వీడిపోయిందని చెప్పారు. బాబాయ్‌ని వేసేసింది అబ్బాయే అని అన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో తమకు సంబంధం లేదని తిరుపతిలోని అలిపిరిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. తనలా జగన్ ఎందుకు చేయడం లేదని చెప్పారు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. తాను ఏ తప్పు చేయకుంటే సత్య ప్రమాణం చేయడంలో ఆలస్యం ఎందుకు అని అడిగారు.

నారా లోకేశ్ ఇవాళ తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని.. అక్కడ గల గరుడ సర్కిల్ వద్ద ప్రమాణం చేశారు. కత్తితో బతికే వాడు కత్తికే చస్తాడని అన్నారు. జగన్ రెడ్డి ఇక్కడకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. జగన్ తన నివాసం నుంచి 45 నిమిషాల్లో ఇక్కడకు రావచ్చని చెప్పారు. కానీ జగన్ మాత్రం అంత ధైర్యం చేయడం లేదన్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications