విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైలవరం వివాదంపై ఎమ్మెల్యే వసంత కామెంట్స్-జోగి,తలశిలతో కలిసి-అంతా ఉమ వల్లే ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు సాగింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా మంత్రి జోగి రమేష్ పావులు కదపడం, మధ్యలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం కూడా జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాజాగా ఈ పంచాయతీని పరిష్కరించారు.

ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో నియోజకవర్గానికి చెందిన కీలక నేతలంతా పాల్గొన్నారు. అలాగే వసంతతో విభేదిస్తున్న మంత్రి జోగి రమేష్, తలశిల రఘురాం కూడా హాజరయ్యారు. దీంతో వారిని ఉద్దేశించి వసంత కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరం గడ్డ మళ్లీ వైసీపీ దేనని వసంత తెలిపారు.
త్రిమూర్తుల కలయికతో విజయం నల్లేరు మీద నడకేనన్నారు.

ysrcp mla vasantha krishnaprasad key comments on mylavaram group fight-here are details

మైలవరం నియోజకవర్గంలో వైసీపీ విభేదాలు టీడీపీ నేత దేవినేని ఉమా సృష్టించిన అపోహలేనని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. త్రిమూర్తులైన వసంత- జోగి- తలసిల కలిసి మళ్లీ మైలవరంలో వైసిపి జండా ఎగరేస్తామని, వైసీపీ విజయం నల్లేరు మీద నడికే నని ధీమా వ్యక్తం చేశారు. తమ మధ్య విభేదాలు అంటూ ఉమా సృష్టించిన అపోహలేని, కలిసికట్టుతో మైలవరంలో ఉమాను ఓడించి మైలవరాన్ని బహుమతిగా ఇచ్చి జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని వసంత తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగి రమేష్ వర్గీయులు సైతం హడావుడి చేయడంతో విభేదాల అపోహలు పటాపంచలు అయినట్లేనని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

English summary
ysrcp mla vasantha krishna prasad on today made key comments on group fight with in the party in mylavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X