యూఆర్ గ్రేట్ మహేశ్ బాబు.. చిన్నారుల హార్ట్ సర్జరీపై సాయి రెడ్డి, ట్వీట్
ఇటీవల 30 మంది చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు హార్ట్ సర్జరీ చేయించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు స్పందించారు. మహేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వంతు వచ్చింది. ఆయన మహేశ్ బాబు దాతృత్వాన్ని కొనియాడారు. కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికపై మహేశ్ బాబును అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహేశ్ బాబును రియల్ హీరోగా కీర్తిస్తూ పొగిడారు.
వరల్డ్ హెల్త్‌డేను పురస్కరించుకుని మహేశ్ బాబు 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్స చేయించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సాయిరెడ్డి ప్రస్తావించారు. మహేశ్ బాబు దయాగుణం కలిగిన వారని కొనియాడారు. ప్రజల మెరుగైన జీవితాల కోసం రియల్ హీరోలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారని ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కొందరే చేయగలరని చెప్పారు.

మహేష్ బాబు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 30 మంది చిన్నారులకు గుండె చికిత్సలు చేయించారు. సామాజిక సేవలో పాలు పంచుకునే మహేష్ హీల్-ఎ-చైల్డ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేసి.. ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇదే విషయాన్ని నమ్రత ప్రపంచానికి చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్స జరిగాయి. మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. శస్త్రచికిత్సలు విజయవంతం చేసిన డాక్టర్లను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే.
In a wonderful act of kindness, actor Mahesh Babu sponsored heart surgeries of 30 children on the occasion of #WorldHealthDay. Real heroes are indeed those who work selflessly to make people’s lives better!@urstrulyMahesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2022
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్‌లోని డాక్టర్ల సహాయంతో 30 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు. ఆపరేషన్లు విజయవంతం అయినందుకు డాక్టర్లకు నమత్ర కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబు తనది గోల్డెన్ హార్ట్ అని మరోసారి నిరూపించుకున్నారని కామెంట్ చేశారు. దీంతో అతని గొప్పతనం మరోసారి రుజువైందని అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications