• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు సెంట్రల్ జైల్ లో గది బుక్ చేసుకో...ఇదేం పారదర్శకత చిట్టినాయుడూ!:విజయసాయి రెడ్డి

|
  Telangana Elections 2018 : ఇదేం పారదర్శకత చిట్టినాయుడూ ! : విజయసాయి రెడ్డి | Oneindia Telugu

  కడప:ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ లేదా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో తనకు అనుకూలంగా ఉండే ఒక గదిని బుక్‌ చేసుకోవాలని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సూచించారు.

  లేనిపక్షంలో తీరా జైలు కెళ్లాక తనకిక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ గగ్గోలు పెట్టే అవకాశమందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విమర్శలతో కూడిన వీడియో విడుదల సందర్భంగా ఆయన మంగళవారం కడపలో మీడియాతో మాట్లాడారు. మరో ఆరు నెలల్లో సిఎం చంద్రబాబు అధికారం కోల్పోతున్నారని విజయసాయిరెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు.

  విచారణ...సిద్ధంగా ఉండండి

  విచారణ...సిద్ధంగా ఉండండి

  తాను చేసిన అవినీతికి గాను దర్యాప్తు సంస్థలు అన్నిటిచేత విచారణ చేయించుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలని విజయసాయి వ్యంగాస్త్రాలు సంధించారు. దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని సిఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని...అలా బెదిరించడానికి చంద్రబాబు ఎవరు?...అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

  చిట్టినాయుడూ...వత్తాసా?...

  చిట్టినాయుడూ...వత్తాసా?...

  మరోవైపు మంత్రి లోకేష్ కూడా దర్యాప్తు సంస్థలను నిషేధిస్తామని అంటున్నారని..."ఆంధ్రప్రదేశ్‌ ఏమైనా నీ బాబు స్థాపించిన రాజ్యం అనుకుంటున్నావా చిట్టి నాయుడూ?...సుజనా చౌదరిలాంటి దోపిడీదారులకు వత్తాసు పలుకుతారా మీరు"...అని విజయసాయిరెడ్డి నిలదీశారు. అలాగే టీడీపీ నేతల ఒత్తిడితో వైసీపీ సోషల్‌ మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులనూ తాము వదలమని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

  ట్విట్టర్ లో...వ్యంగాస్త్రాలు

  ట్విట్టర్ లో...వ్యంగాస్త్రాలు

  అంతకుముందు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పై వ్యంగాస్త్రాలు సంధించారు. ఇదేం పారదర్శకతా చిట్టి నాయుడూ.. అంటూ మంత్రి లోకేష్ పై సెటైర్లు వేశారు. వేల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి లూటీ చేసిన సుజనా చౌదరికి...చంద్రబాబు రెండు సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.

   చంద్రబాబు టాలెంట్...తెలుస్తుంది

  చంద్రబాబు టాలెంట్...తెలుస్తుంది

  సుజనాకు మంత్రి పదవి విషయమై ప్రధాని అభ్యంతరం చెప్పినా...ఆయనపై ఒత్తిడి తెచ్చి మరీ కేంద్రమంత్రిని చేశారంటే...చంద్రబాబుకు ఆయనెంత ముఖ్యమో అర్థమైపోతోందన్నారు. ఒక చిన్న రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు ఏకంగా ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కే వెయ్యికోట్లు ఫండింగ్‌ చేయగలిగారని అంటున్నారంటే...చంద్రబాబు టాలెంట్ ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

  తెగ జోకులు...పేలుస్తున్నారు

  తెగ జోకులు...పేలుస్తున్నారు

  నాయుడు బాబు ఈ మధ్య తెగ జోకులు పేలుస్తున్నారని, ఐఏఎస్‌ అధికారి ఆపై విమానాల పైలెట్‌ అవ్వాలనుకున్నారని...డాక్టర్‌ కావాలనుకుని పొలిటికల్‌ యాక్టరయ్యానని చెప్పడం విని జనం నవ్వుకుంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తుమ్మినా...దగ్గినా రాసే కుల పత్రికలు ఉండటంతో బాబు ఇలా వెరైటీ కామెడీ చేస్తున్నారని విజయసాయి దుయ్యబట్టారు. చంద్రబాబు ఏదైనా అయ్యేవాడో లేదో గాని...ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రజలకు పట్టిన శనిగా మాత్రం అయ్యాడని జనం అనుకుంటున్నారని విజయసాయి విమర్శించారు.

  జీవోలు...దాచిపెడతారా?

  జీవోలు...దాచిపెడతారా?


  ఒక్క రోజులోనే 36 జీఓలు జారీ చేసి అందులో 33 జీఓలను ప్రభుత్వ పోర్టల్ లో పెట్టకుండా దాచి పెడతారా?...అంటూ లోకేష్ ను విజయసాయిరెడ్డి నిలదీశారు. మీ తెలివితేటలు దొంగతనం చేసి సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఎత్తుకు పోయిన చందంగా ఉన్నాయని విమర్శించారు. బందిపోటు దొంగల్లా ప్రజలను ఎన్నాళ్లు దోచుకుంటారని విజయసాయి రెడ్డి చంద్రబాబు, లోకేష్ లను ఉద్దేశించి ప్రశ్నించారు.

  English summary
  Kadapa:YSRCP MP Vijayasai Reddy lashed out at Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu against the latter's opportunistic politics. MP Vijayasaireddy has released a Video and took to twitter and exposed how the TDP Chief and his Son Lokesh corrupted activities.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X