Virat Kohli : తండ్రీ, కొడుకుల రికార్డు ముంగిట కొహ్లీ- సచిన్ తర్వాత ఇదే..

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించబోతున్నాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈ నెల 12న విండ్సర్ పార్క్ లో ప్రారంభమయ్యే తొలిటెస్టులో ఈ రికార్డు సాధించనున్నాడు. గతంలో అతిపిన్న వయస్సులో క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన ఈ రికార్డును ఇప్పుడు కొహ్లీ సమం చేయబోతున్నాడు. సచిన్ తర్వాత ఈ రికార్డు సాధించబోతున్న రెండో క్రికెటర్ గా కింగ్ కొహ్లీ నిలవబోతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో తండ్రీ, కొడుకులతో ప్రత్యర్ధులుగా ఆడిన క్రికెటర్ల సంఖ్య చాలా అరుదు. భారత్ లో అయితే మరీ అరుదు. ఎందుకంటే చాలా తక్కువ వయస్సులో క్రికెట్లోకి అడుగుపెట్టిన వారికి చాలా అరుదుగా ఇలాంటి అవకాశం లభిస్తుంటుంది. ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ ఈ రికార్డు అందుకోబోతున్నాడు. గతంలో 2011లో విండీస్ టూర్ సందర్భంగా ఆ జట్టులో సీనియర్ బ్యాట్స్ మెన్ శివనారాయణ్ చందర్ పాల్ తో కొహ్లీ ఆడాడు.

virat kohli set to achieve father and son record in windies tour, only after sachin tendulkar

ఇప్పుడు విండీస్ తో జరిగే తొలిటెస్టులో విరాట్ కొహ్లీ శివ్ నారాయణ్ చందర్ పాల్ కుమారుడు, అతని లాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అయిన తేజ్ నారాయణ్ చందర్ పాల్ తో కలిసి ఆడబోతున్నాడు. ఇలా విదేశాల్లో తండ్రీ, కొడుకులతో తలపడిన ఘనత భారత్ లో సచిన్ టెండూల్కర్ కు మాత్రమే ఉంది. అతని తర్వాత ఇప్పుడు కొహ్లీ ఈ రికార్డు అందుకోబోతున్నాడు. విండీస్ తో ఎల్లుండి ప్రారంభమయ్యే తొలిటెస్టులో ఆడితే చాలు కొహ్లీకి ఈ రికార్డు దక్కుతుంది.

గతంలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ 1992లో ఆస్ట్రేలియా దిగ్గజం జెఫ్ మార్ష్ తో కలిసి ఆడాడు. అనంతరం 2011-12 సీజన్లో అతని కుమారుడు షాన్ మార్ష్ తో కలిసి కూడా ఆడాడు. దీంతో తండ్రీ, కొడుకులతో కలిసి ఆడిన రికార్డు సచిన్ సొంతమైంది. ఇప్పుడు విరాట్ కొహ్లీ ఈ రికార్డును సమం చేయబోతున్నాడు. భారత్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత తండ్రీ కొడుకులతో విదేశాల్లో తలపడిన రెండో క్రికెటర్ గా కొహ్లీ నిలవబోతున్నాడు. దీంతో విండీస్ టూర్ లో కింగ్ కొహ్లీపై అందరి దృష్టీ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+