విశాఖలో ఏకంగా ట్రావెల్ బస్సునే చోరీ చేసిన ప్రబుద్ధుడు.. కాకుంటే చివరికి ఇలా!!
ప్రపంచవ్యాప్తంగా చోర కళలో నిష్ణాతులైన చోర శిఖామణులు ఎందరో ఉన్నారు. దొంగతనాలు చేయడంలోనూ వారు ఎవరికివారే ప్రత్యేకం. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్పెషలైజేషన్. కొందరు ఆలయాలలో దేవతామూర్తుల విగ్రహాలు, హుండీలు దొంగతనాలు చేస్తే, మరికొందరు రోడ్డు మీద వెళ్లే వాళ్ళ మెడలోని చైన్స్ ను, బాగ్స్ ను కొట్టేస్తారు. కొందరు అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తాళాలు వేసిన ఇళ్లలో దోపిడి చేస్తే, మరికొందరు ఇంట్లో జనాలు ఉన్నాసరే బెదిరించి మరి దొంగతనాలు చేస్తారు. మోటర్లు దొంగతనం చేసే వాళ్ళు, మీటర్లు దొంగతనం చేసేవాళ్ళు, ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసేవారు, ఆటోలు దొంగతనం చేసేవారు ఇలా ఒకటేమిటి దొంగతనాలలో ఎవరికి వారే ప్రత్యేకం.ఎవరి స్కిల్ వాళ్ళదే.

ట్రావెల్ బస్సు చోరీ చేసిన దుండగుడు .. బస్సు మిస్సింగ్ కేసు
అయితే తాజాగా ఏకంగా ఒక ట్రావెల్ బస్సును చోరీ చేయడానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ దక్షిణ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ బస్సు చోరీకి గురైంది. సింధూర గెస్ట్ హౌస్ పక్కన రాత్రి సమయంలో భోజనం చేయడానికి ఓ బస్సు డ్రైవర్ ట్రావెల్ బస్సును ఆపి భోజనానికి వెళ్లాడు. డ్రైవర్ భోజనం చేసి వచ్చే గ్యాప్ లో బస్సు దొంగతనానికి గురైంది . భోజనం చేసి వచ్చి చూసిన బస్సు డ్రైవర్ బస్సు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దిక్కుతోచని స్థితిలో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. దీంతో బస్సు కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అక్కడ అదృశ్యమైన బస్సు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టినట్టు గుర్తించారు.

విద్యుత్ స్తంభాన్నిఢీ కొట్టిన బస్సు.. చోరీకి గురైన బస్సుగా గుర్తింపు
టౌన్ కొత్త రోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఓ బస్సు ఢీ కొట్టి ఉందని, అందులో ఎవరూ లేరని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డుపై నుండి పక్కకు తొలగించారు. బస్సు డ్రైవ్ చేసిన వ్యక్తి సరిగా నడపక పోవడంతో, విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సులో ఉన్న పేపర్లు పరిశీలించిన పోలీసులు బస్సు డ్రైవర్ ను గుర్తించి సమాచారం అందించారు.

బస్సు నడపటం రాక విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బస్సును వదిలేసిపోయిన దొంగ
ఏకంగా బస్సుని దొంగతనం చేసిన సదరు ప్రబుద్ధుడు, బస్సు నడపడం రాక, దొంగతనం చేసిన కంగారులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పరారై ఉంటాడని ట్రాఫిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను తనిఖీ చేస్తున్నారు. బస్సు చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బస్సు దొంగతనం చేయాలని అంతా పక్కాగా ప్లాన్ చేసినా సరిగ్గా బస్సు నడపరాక సదరు దొంగ చోరీ చేయడంలో విఫలమయ్యాడు. ఇక ఈ బస్సు దొంగతనంపై స్థానికులు ఆసక్తికర చర్చ చేస్తున్నారు. ఏకంగా బస్సుని దొంగతనం చేసిన వాడు బస్సు నడప రాక అడ్డంగా బుక్కయ్యాడు అని అంతా నవ్వుకుంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications