విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం, విరిగిపడ్డ క్రేన్, పది మంది మృతి
విశాఖపట్టణం షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది. క్రేన్ విరిగిపడటంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక మరో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. ఒక్కసారిగా క్రేన్ విరిగిపడిందని షిప్ యార్డ్ వర్గాల ద్వారా తెలిసింది. కానీ లోపలకి ఎవరినీ రానీయడం లేదు.
Recommended Video
#VisakhapatnamShipyard : విశాఖపట్టణం షిప్ యార్డులో భారీ ప్రమాదం.. క్రేన్ విరిగిపడి 10 మంది మృతి !
సాధారణంగా పెద్ద పెద్ద కంటైయినర్లను తీసుకొచ్చేందుకు క్రేన్లను వాడుతుంటారు. ఇవాళ కంటైనర్ తీసుకొచ్చారో లేదో తెలియదు. కానీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. అది కూలడానికి కారణం కూడా తెలియదు. ఆ సమయంలో క్రేన్ కింద పది మంది వరకు ఉన్నారు.

క్రేన్ శకలాలు పడి నలుగురు స్పాట్‌లోనే చనిపోగా.. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనపై హిందుస్తాన్ షిప్ యార్డు ఇంతవరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications