విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖకు గుడ్‌న్యూస్: ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం, ఇప్పుడైతే ఈ ప్రాంతాల్లోనే

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ విశాఖపట్నం వాసులకు మంచి కబురు అందించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలను విశాఖ నగరంలో ప్రారంభించింది. విశాఖలో 5జీ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని, మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్ భార్గవ వెల్లడించారు.

విశాఖలో 5జీ సేవలు ఈ ప్రాంతాల్లోనే..

విశాఖలో 5జీ సేవలు ఈ ప్రాంతాల్లోనే..

తమ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 18వ నగరంగా విశాఖపట్నం అని ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ద్వారకానగర్, బీచ్ రోడ్డు, దాబా గార్డెన్స్, మద్దిలపాలెం, వాల్దేర్ అప్‌ల్యాండ్స్, పూర్ణా మార్కెట్, గాజువాక జంక్షన్, ఎంవీపీ కాలనీ, రాంనగర్, తేన్నేటి నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఎయిర్‌టెల్ సంస్థ పేర్కొంది.

4జీ సిమ్‌తోనూ 5జీ సేవలు పొందొచ్చు

4జీ సిమ్‌తోనూ 5జీ సేవలు పొందొచ్చు

దశలవారీగా విశాఖ నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా సేవలను విస్తరిస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. 4జీ సేవలు పొందుతున్న వినియోగదారులు ఉచితంగానే 5జీ సేవలు పొందొచ్చని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డు కూడా మార్చాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ సంస్థ స్పష్టం చేసింది.

ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌తో కూడా 5జీ సేవలు తెల్సుకోవచ్చు

ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌తో కూడా 5జీ సేవలు తెల్సుకోవచ్చు


అంతేగాక, 5జీ సపోర్టుతో కూడిన మొబైల్, మీరుంటున్న ప్రాంతంలో 5జీ నెట్ వర్క్ ఉంటే కూడా ఈ సేవలను అందిపుచ్చుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. నెట్వర్క్ సెట్టింగ్స్ లో 5జీ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందని తెలిపింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కూడా మీ మొబైల్ 5జీకి సపోర్ట్ చేస్తుందా? మీ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ ఉందా? అనే వివరాలు తెలుసుకోవచ్చని ఎయిర్‌టెల్ వివరించింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్.. తాజాగా విశాఖపట్నంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

English summary
Airtel 5g services started in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X