విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

vizag gas leak : విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స....

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు సాంత్వన కలిగించే మరో వార్తను ప్రభుత్వం చెప్పింది. బాధితులు ఆరోగ్య శ్రీ పథకం కింద ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స తీసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చింది.

విశాఖలో విష వాయువులు పుట్టుకొచ్చిన వేళ.. జగన్ సర్కార్ సరికొత్త షాక్: మరో నోటీసు: సుమోటోగా..విశాఖలో విష వాయువులు పుట్టుకొచ్చిన వేళ.. జగన్ సర్కార్ సరికొత్త షాక్: మరో నోటీసు: సుమోటోగా..

విశాఖపట్నంలోని ఆరోగ్య శ్రీ పథకం కింద అనుసంధానం అయిన, అనుసంధానం కానీ ఏ ఆస్పత్రిలోనైనా వీరు చికిత్స తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రులకు సమాచారం ఇచ్చామని, బాధితుల చికిత్స కోసం అయ్యే ప్రతీ రూపాయినీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి చెల్లిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ap govt to provide free treatment to vizag gas leak victims through arogya sri

Recommended Video

Visakhapatnam Gas Leak : Gas Neutralised, 8 km Radius Treated With Sea Water

విశాఖపట్నం పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో ప్రస్తుతం కొన్నింటిని కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. ఇవి కాకుండా ఏ ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా గ్యాస్ ప్రమాద బాధితులు చికిత్స తీసుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో సూచించింది. ఇంకా ఏమైనా అనుమానాలుంటే విశాఖపట్నం జిల్లా ఆరోగ్య శ్రీ పథకం సమన్వయకర్త డాక్టర్ భాస్కరరావును సెల్ ఫోన్ నంబరు 8333814019లో సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

English summary
andhra pradesh govt has allowed visakhpatnam polymer industry gas leak victims to take treatment through ysr arogya sri scheme in any hospital. after his visit to victims, cm jagan has issued orders in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X