వైసీపీ విజయం అందువల్లే, దొంగ ఓట్లు, దొంగ నోట్లు.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా? అచ్చెన్నాయుడు సవాల్
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని,తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించారని వైసీపీ నేతలు జబ్బలు చరుచుకుంటుంటే, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ సాధించింది దొంగ ఓట్లు,దొంగ నోట్ల విజయమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.అంతేకాదు దొంగ ఓట్లు వేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మండిపడిన అచ్చెన్నాయుడు,దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.

జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయం కాదు , దొంగ ఓట్లు, దొంగ నోట్ల విజయం
తిరుపతి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయం కాదని, ప్రైవేటు బస్సుల విజయమని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. దొంగ కంపెనీలు పెట్టి వేల కోట్లు దోచినట్లు, దొంగ ఓట్లు వేసి తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న ఫైర్ అయ్యారు .ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా నైతికంగా తెలుగుదేశం పార్టీనే గెలిచిందని ప్రజలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.

వైసీపీది విజయమే కాదు, నైతికంగా గెలిచింది టీడీపీనే
ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేసి,ఓటర్ల హక్కులను కాలరాసి తెచ్చుకున్నది,విజయమే కాదని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. నైతికంగా టిడిపినే గెలిచిందన్నారు. వైసీపీ నేతలు గెలిచామని చెప్పుకుంటున్నారు కానీ, నైతికంగా గెలిచిన ఆనందం వైసీపీ నేతల ముఖాల్లో కనిపించడం లేదన్నారు.అన్యాయాన్ని తిరుపతి వీధుల్లో నడిపించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు అచ్చెన్నాయుడు.ఏదో ఒక రోజు తప్పనిసరిగా వస్తుందని,వైసిపి చేసే ప్రతి అరాచకానికి దుర్మార్గాలకు బుద్ధి చెబుతామనిఅచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

దొంగ ఓట్లు వేసినట్టు ఆధారాలు చూపించినా ఎస్ఈసి స్పందించలేదు
కచ్చితంగా ఓరోజు వైసీపీ నేతలు అందరూ బాధ పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దురాగతాలను దగ్గర్నుండి చూపించిన టిడిపి కార్యకర్తలు,మరియు నాయకుల తెగువను ప్రశంసించిన అచ్చెన్న, తిరుపతి ప్రజలు వైసీపీ నేతల మదాన్ని అణచారని చెప్పారు.దొంగ ఓట్లు వేసినట్టు స్పష్టమైన ఆధారాలు చూపించినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణమని అచ్చెన్నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దొంగఓట్ల కు పాల్పడలేదని వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు బహిరంగ ప్రమాణానికి రావాలని సవాల్
వైసీపీ నేతలు నిజాయితీగా గెలిస్తే, దొంగ ఓట్లు వేయించకుంటే,దొంగఓట్ల కు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు బహిరంగ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. మరి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అచ్చెన్నాయుడు చేసిన సవాల్ ను స్వీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో టీడీపీ నేతల సత్యప్రమాల హడావిడి పెరుగుతోంది. తిపుపతి ఎన్నికల ప్రచార సమయంలో కూడా నారా లోకేష్ సత్యప్రమాణం చేసి అలిపిరి వద్ద హడావిడి చేశారు. జగన్ ను తన సవాల్ స్వీకరించి వైఎస్ వివేకా హత్యపై ప్రమాణం చెయ్యాలని ఛాలెంజ్ చేశారు.












Click it and Unblock the Notifications