Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ద నౌక జల ప్రవేశం - క్షిపణుల ప్రయోగానికి వీలుగా : వైజాగ్ లో మొహరింపు..!!

భార‌త నావికాద‌ళంలోకి మ‌రో నూత‌న యుద్ధ‌నౌక‌ చేరింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్​ఎస్​ విశాఖపట్నం యుద్ధ‌నౌక‌ను ఇవాళ‌ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను నావికాద‌ళంలో ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరించనున్నారు. దేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చేందుకు నౌకలను నిర్మించే సత్తా భారత దేశానికి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భావి అవసరాలకు తగినట్లుగా దీనిని తయారు చేసినట్లు చెప్పారు.

Recommended Video

    INS Visakhapatnam Features నావికాద‌ళంలోకి... చరిత్రలో నిలిచిపోయేలా| Defense Updates| Oneindia Telugu

    స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక


    ఈ నౌక జల ప్రవేశంతో ప్రాచీన, మధ్య యుగాలనాటి భారత దేశ సముద్ర రంగ శక్తి, సామర్థ్యాలు, నౌకా నిర్మాణ నైపుణ్యాలు, ప్రతిష్ఠాత్మక చరిత్ర గుర్తుకొస్తున్నాయన్నారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ప్రాజెక్టు 15బీలో భాగంగా మజగావ్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. ఇది స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక. ఇటువంటి నాలుగు నౌకలను తయారు చేస్తున్నారు. మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా స్వదేశీ నౌకలు, జలాంతర్గాముల తయారీలో భారత్​ ముందంజలో ఉన్న‌ద‌న్నారు. ఈ యుద్ధ‌నౌక నుంచి బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్‌ క్షిపణులతో సహా పలురకాల క్షిపణులను ప్రయోగించవచ్చు.

    విశాఖపట్నంలో మోహరింపు

    విశాఖపట్నంలో మోహరింపు

    ఈ నౌక కదలిక‌ల‌ను శత్రుదేశాల‌ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. అదేవిధంగా ఇందులో రెండు మల్టీరోల్‌ హెలికాప్టర్లు ఉంటాయి. నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రలో విశాఖలోని డాల్ఫిన్‌నోస్‌ కొండ, దానిపై ఉండే దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నంగా కొమ్ములతో కనిపించే కృష్ణజింక ముఖ భాగాన్నిఖరారు చేశారు.

    క్షిపణుల ప్రయోగానికి వీలుగా


    అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని ఎంచుకున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ ఉండేవిధంగా చట్టబద్ధ నిబంధనలు అమలుకావాలని కోరుకుంటున్నట్లు రాజ్ నాధ్ తెలిపారు. నౌకాయానం స్వేచ్ఛగా జరగాలని, సార్వత్రిక నియమాలు అమలు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం భద్రత విషయంలో భారత దేశం చాలా ముఖ్యమైనది కావడం వల్ల భారత నావికా దళం పాత్ర మరింత ముఖ్యమైనదిగా మారిందన్నారు.

    స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రంగా


    ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యయం 2023 నాటికి 2.1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనా ఉందని కేంద్ర రక్షణ మంత్రి చెప్పుకొచ్చారు. అందువల్ల భారత దేశం తన శక్తి, సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు, స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉందన్నారు. పరిశ్రమల అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు, 'ఫ్లోట్', 'మువ్', 'ఫైట్' కేటగిరీలలో స్వదేశీ ఐటమ్స్‌ను పెంచినందుకు భారత నావికా దళాన్ని అభినందించారు. ఇప్పటి వరకు సాధించిన విజయాల వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని రాజ్ నాధ్ సింగ్ చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+