హతవిధి: కూలిన ఫ్లై ఓవర్ బ్రిడ్జీ పిల్లర్, ఇద్దరు మృతి
ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. క్షణకాలంలో రెప్పపాటులో ఏమైనా జరగొచ్చు. అవును అచ్చం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇవాళ మరో ఘటన జరిగింది. విశాఖపట్టణం శివారు అనకాపల్లె వద్ద ప్లై ఓవర్ బ్రిడ్జీ పిల్లర్ కూలింది. ఆ సమయంలో వెళుతున్న వాహనం నుజ్జు నుజ్జ అయ్యింది. ఇద్దరు చనిపోయారని ప్రాథమికంగా తెలిసింది.

ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అనకాపల్లి వద్ద ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉందని అధికారులు తెలిపారు. ఫ్లై ఓవర్ సైడ్ బీమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని... ఆ సమయంలో కింద ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలాయి. దీంతో అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు.
హతవిధి: కూలిన ఫ్లై ఓవర్ బ్రిడ్జీ పిల్లర్, ఇద్దరు మృతి#flyoverbridge, #pillar pic.twitter.com/Q0roJXSjW7
— oneindiatelugu (@oneindiatelugu) July 6, 2021
వంతెన కింద మరికొందరు చిక్కుకున్నారేమోనని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటన స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ భారీ వంతెన నిర్మాణం జరుగుతోంది. రెండేళ్ల నుంచి ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications