విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు.. ఒడిశాకు చెందిన వారు, కానీ

|
Google Oneindia TeluguNews

వీకెండ్.. బీచ్‌‌కు వెళితే చాలు ఇక అంతే.. అవును.. యువత ఆగరు. కానీ రాకాసి అలలు మాత్రం లాక్కెళ్లిపోతున్నాయి. ఇటీవల అనకాపల్లి జిల్లాలో గల పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతయిన సంగతి తెలిసిందే. ఇవాళ విశాఖ ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు అయ్యారు. ఆ తర్వాత వారిని స్థానికులు రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అలలు ఎగసిపడటంతో యువకులు సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో వారు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. వారిని కాపాడారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సరదాగా స్నానం చేసేందుకు వారు ఆర్కే బీచ్ కి వెళ్లారు. బీచ్ లలో సముద్ర స్నానాలు చేయొద్దని హెచ్చరికలు ఉన్నప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు.

four youth drown in vizag rk beach, all are safe

ఆర్కే బీచ్ ప్రాంతం అంతా రాళ్లతో కూడిన అలలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ అలలు వచ్చాయంటే ఆ ధాటికి చెల్లాచెదురు అయిపోతారు. ఎంత ఈత వచ్చినప్పటికీ రాకాసి అలల ఉధృతిని తట్టుకోవడం అంత సులభం కాదు. ఇటీవలే అనకాపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. అచ్యుతాపురం మండలం సీతాపాలెం పూడిమడక బీచ్ లో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. ఒకరిని స్థానికులు కాపాడారు.

కళ్లముందే స్నేహితులు గల్లంతుకావడంతో విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఇవాళ నలుగురు గల్లంతు కాగా.. వారిని స్థానికులు కాపాడారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

English summary
four youth drown in vizag rk beach. locals are saved life. they belongs to odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X