విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోటల్ లో సీఎం బస..! విశాఖలో ముఖ్యమంత్రి నివాసం కోసం: సొంత ఇంటి నిర్మాణం..!

|
Google Oneindia TeluguNews

విశాఖలో ప్రభుత్వం పాలనా రాజధానిగా ప్రకటించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అసెంబ్లీలో అధికారిక నిర్ణయం జరిగిన తరువాత సాధ్యమైనంత త్వరగా విశాఖ నుండే పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..ఇప్పటికే మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటుకు దాదాపు నిర్ణయం జరిగింది. ఇక, ముఖ్యమంత్రి నివాసం కోసం అధికారులు..ప్రభుత్వంలోని ముఖ్య నేతలు అన్వేషణ ప్రారంభించారు. తొలుత భీమిలిలో ముఖ్యమంత్రి నివాసం..క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, ఇప్పుడు తాత్కాలికంగా ముఖ్యమంత్రి ఒక స్టార్ హోటల్ లో కొద్ది కాలం అద్దెకు ఉండేలా..ఆ తరువాత ఆయన కోసం ఒక భవనం ఎంపిక చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

విశాఖలో రాజధాని ఎవరు అడిగారు: సంపద సృష్టి లేదు..చిచ్చు పెడుతున్నారు: యనమల ఫైర్..!విశాఖలో రాజధాని ఎవరు అడిగారు: సంపద సృష్టి లేదు..చిచ్చు పెడుతున్నారు: యనమల ఫైర్..!

స్టార్ హోటల్ లో తాత్కాలికంగా..
హైపవర్ కమిటీ నివేదిక..కేబినెట్ ఆమోదం..అసెంబ్లీలో తీర్మానం..ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తయితే సాధ్యమైనంత త్వరగా విశాఖ నుండే పాలన ప్రారంభిచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో ప్రధానంగా అక్కడ ముఖ్యమంత్రి నివాసం పైన అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇందు కోసం పార్టీ ముఖ్య నేతలు భీమిలిలో ఒక భవంతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, దానిని కాదని మరి కొన్నింటిని పరిశీలన ప్రారంభించారు. అధికారిక ప్రక్రియ పూర్తయి..సీఎం విశాఖ నుండి పాలన ప్రారంభించే సమయానికి అనువైన భవనాలు అందుబాటులో లేకపోతే..తాత్కాలికంగా కొద్ది కాలం విశాఖలోని ఒక హోటల్ లో వసతి కల్పించే విధంగా ఏర్పట్లుగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ హోటల్ నిర్మాణం తుది దశలో ఉందని..కొద్ది పాటి మార్పులతో ఆ నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం. అదే సమయంలో ఇతర భవనాల పైనా అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

Govt officers and YCP key leaders searching for CM Residence in Vizag city

భద్రత..సౌకర్యాలపైనే..
ముఖ్యమంత్రి నివాసం పైనే ఇప్పుడు అధికారులు అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. నగర పరిధిలోని కట్టుదిట్టమైన రక్షణ ఉన్న ప్రదేశాల్లోని కొన్ని భవనాలను పరిశీలిస్తున్నారు. కొన్ని సంస్థల అతిథిగృహాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి శాశ్వత ప్రాతిపదికన నివాసం ఉండేందుకు రుషికొండ, మధురవాడ, భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఆయాప్రాంతాల్లో ఉన్న అనుకూల స్థలాలను గుర్తించి సొంత గృహాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఎక్కడ నిర్మించాలన్న అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. నగర శివారులోని ఏదైనా కొండపై ఉంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు అవసరమైన కట్టుదిట్టమైన భద్రత సహజసిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటుగా భీమిలిలో ఒక విద్యా సంస్థకు చెందిన భవనాలను పరిశీలించారు. ఇక, ఈ వారంలోనే సీఎం నివాసం పైన మూడు ప్రత్యామ్నాయాలను ముఖ్యమంత్రి వద్ద ఉంచి..ఆమోదం పొందాలని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Govt officers and YCP key leaderes searching for CM Residence in Vizag city. They thinking that temporarary accomidation to be arrange in star hotel. In Bhimily one guest house also selected as one of the option.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X