ఆంధ్రా యూనివర్శిటీ స్టూడెంట్స్‌తో జగన్ భేటీ- ఫేస్ టు ఫేస్

అమరావతి: ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోన్న సాగర నగరం విశాఖ‌ప‌ట్నంలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పటికే 14,500 కోట్ల రూపాయల వ్యయంతో అదాని డేటా సెంటర్ ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇక తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ విశాఖలో ఏర్పాటు కానుంది.

అదే- ఇనార్బిట్ మాల్. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే ర‌హేజా గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. 17 ఎక‌రాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోతోంది ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. దీనికి సంబంధించి ప్రాథ‌మిక ఒప్పందాలు ఇప్ప‌టికే పూర్తయ్యాయి. త్వ‌ర‌లోనే మాల్ నిర్మాణ ప‌నుల‌ను ర‌హేజా సంస్థ మొద‌లు పెట్ట‌నుంది.

Here is the CM YS Jagans Visakhapatnam tour schedule on August 1

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 1వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇనార్బిట్ మాల్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన 50 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారాయన. ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులతోనూ ముఖాముఖిగా భేటీ కానున్నారు.

దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారు.

10:45 నిమిషాలకు విశాఖపట్నానికి చేరుకుంటారు. 11:15 నిమిషాలకు కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు భూమిపూజ చేస్తారు వైఎస్ జగన్. 12:20 నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 12:25 నిమిషాలకు జీవీఎంసీ పరిధిలో 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారాయన.

అనంతరం సిరిపురం ఏయూ క్యాంపస్‌కు బయలుదేరి వెళ్తారు. 12:40 నిమిషాలకు క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయో మానిటరింగ్ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను వైఎస్ జగన్ ఇనాగ్యురేట్ చేస్తారు. 1:20 నిమిషాలకు బీచ్ రోడ్‌లో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో ముఖాముఖి పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణమౌతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+