Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం మరో క్లారిటీ- అమ్ముడుకాకపోతే మూసేస్తాం- ప్రైవేటీకరణకు బెదిరింపులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఓవైపు ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. అంతే కాదు స్టీల్‌ ప్లాంట్‌పై రోజుకో వివాదాస్పద ప్రకటనతో మరింత ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ వంద శాతం ప్రైవేటీకరణ తప్పదని ప్రకటించిన కేంద్రం.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతే కాదు ఇప్పుడు కొత్త కొత్త అంశాలను తెరపైకి తెస్తోంది. అసలు స్టీల్‌ ప్లాంట్‌లు అమ్ముడు కాకపోతే పూర్తిగా మూసివేస్తామంటూ మరో భారీ షాక్‌ ఇచ్చింది. దీంతో ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను ఏమాత్రం గౌరవించడం లేదని అర్ధమవుతోంది.

వైజాగ్‌ స్టీల్‌పై కేంద్రం రోజుకో షాక్‌

వైజాగ్‌ స్టీల్‌పై కేంద్రం రోజుకో షాక్‌

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసే విషయంలోనూ వేగంగా అడుగులేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కిమ్మనకుండా చోద్యం చూడాల్సిన పరిస్దితి. దీంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఇప్పుడు ఆలస్యంగా కళ్లు తెరిచి ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్రం పార్లమెంటులో షాకింగ్‌ సమాధానాలు ఇస్తోంది. ఇప్పటికే ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్టీల్‌ ప్లాంట్‌ వందశాతం ప్రైవేటీకరణ తప్పదని తేల్చిచెప్పగా.. తాజాగా ఆమె డిప్యూటీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మరో షాక్‌ ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్‌ అమ్ముడు కాకపోతే మూసివేతే

స్టీల్ ప్లాంట్‌ అమ్ముడు కాకపోతే మూసివేతే


ప్రభుత్వ రంగ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణలో భాగంగా విక్రయానికి పెడతారు. ప్రైవేటు రంగంలో ఉన్న సంస్ధలు వెంటనే తీసుకుంటే అభ్యంతరం లేదు. అలా కాకుండా విక్రయంలో ఇబ్బందులు ఎదురై ఆగిపోతే మాత్రం స్టీల్‌ ప్లాంట్‌ను మూసివేయక తప్పదు. ఇప్పుడు ఇదే విధానం స్టీల్‌ ప్లాంట్ల విషయంలో అమలు చేస్తామని రాజ్యసభలో కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్ తేల్చిచెప్పేశారు. దీంతో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కార్మికసంఘాలకు ఈ ప్రకటన భారీ షాక్‌ ఇచ్చినట్లయింది.

స్టీల్‌ ప్లాంట్లపై కేంద్రం విధానమిదే

స్టీల్‌ ప్లాంట్లపై కేంద్రం విధానమిదే

దేశవ్యాప్తంగా ఉక్కు ప్లాంట్ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం ఎప్పటినుంచో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంది. కేంద్రం చెబుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ప్రభుత్వ రంగ సంస్ధలను వ్యూహాత్మక రంగం, వ్యూహాత్మకం కాని రంగాలుగా విభజించించి. వ్యూహాత్మక రంగాన్ని వదిలిపెట్టి, వ్యూహాత్మకం కాని రంగాల్లో ఉన్న పరిశ్రమలను వరుసగా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ సాగుతోంది.

 స్టీల్‌ ప్లాంట్‌పై ఆశలు వదులుకోవాల్సిందే

స్టీల్‌ ప్లాంట్‌పై ఆశలు వదులుకోవాల్సిందే

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశంలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల జాబితాలోకి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిశ్రమలన్నీ దేశంలో నష్టాల బాటలోనే ఉన్నాయి. వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా వదిలించుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. వ్యూహాత్మక రంగంలో ఉన్న రక్షణ, భధ్రత, ఇతర రంగాల్లో భాగంగా ఉంటే మాత్రం విశాఖ స్టీల్‌పై పునరాలోచనకు అవకాశం ఉండేది. కానీ వ్యూహాత్మకం కాని రంగంలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు దీనిపై ఆశలు వదులుకోవడమే మంచిదనే విధంగా కేంద్రం సంకేతాలు ఇస్తోంది.

మూసివేత కంటే ప్రైవేటీకరణే మేలని బెదిరింపులు

మూసివేత కంటే ప్రైవేటీకరణే మేలని బెదిరింపులు

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం... అవి అమ్ముడు కాకపోతే మూసేస్తామంటూ చేస్తున్న హెచ్చరికల వెనుక మరో మర్మం కూడా దాగుంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలను దారికి తెచ్చేందుకే కేంద్రం మూసివేతను తెరపైకి తెస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ప్రైవేటీకరణను ఒప్పుకోకపోతే సంస్ధ పూర్తిగా మూతపడి మీ భవిష్యత్తు నాశనమవుతుందని కేంద్రం బహిరంగంగానే చెబుతోంది. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో కార్మికులు కూడా ప్రైవేటీకరణకు ఒప్పుకునేలా కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+