విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థులే టార్గెట్ గా గుప్పుమంటున్న గంజాయి ... ట్రాఫికర్స్ వారే, విక్రయించేది వారే ..

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది .గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గంజాయి మాత్రం ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాలు, గంజాయి అక్రమ రవాణాకు సైతం విద్యార్థులనే ప్రోత్సహిస్తున్నారు . తాజాగా గంజాయి అమ్మటానికి హైదరాబాద్ తీసుకువస్తున్న నలుగురు విద్యార్థులను విశాఖ పోలీసులు పట్టుకోవటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

విశాఖ మన్యంలో మరోమారు.. 1000 కేజీల గంజాయి పట్టివేతవిశాఖ మన్యంలో మరోమారు.. 1000 కేజీల గంజాయి పట్టివేత

ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని గంజాయి దందాలోకి దిగిన విద్యార్థులు

ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని గంజాయి దందాలోకి దిగిన విద్యార్థులు

చదువుకునే వయసులో వ్యసనాలకు అలవాటుపడిన నలుగురు విద్యార్థులు ఈజీగా డబ్బు సంపాదించటానికి గంజాయి అక్రమ రవాణా చేసి , విద్యార్థులకు విక్రయించాలని భావించారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్మడాన్నే మార్గంగా ఎంచుకుని కొన్ని రోజులుగా సీక్రెట్ గా గంజాయి దందా కొనసాగిస్తున్నారు. వారు గంజాయిని కాలేజీ విద్యార్ధులకు సరఫరా చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.ఇక వీరు ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలీకుండా అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారు.

తల్లిదండ్రులకు తెలీకుండా గంజాయి దందా ..

తల్లిదండ్రులకు తెలీకుండా గంజాయి దందా ..

ఇటీవల ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని ఇంట్లో అబద్దం చెప్పిన నలుగురు విద్యార్థులు గంజాయి కోసం వైజాగ్ వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా వైజాగ్ దగ్గర పోలీసుల కార్డెన్ సర్చ్ లో గంజాయితో పాటు వీరు పట్టుబడ్డారు. హైదరాబాద్ లోని బాచుపల్లి కి చెందిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం గంజాయి దందాను ఎంచుకున్నారు.ఇంట్లో తల్లిదండ్రులు కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్నారు అని భ్రమ పడుతున్నారు.

 బాపట్లలో పెళ్లి అని చెప్పి గంజాయి ట్రాఫికింగ్ కు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు

బాపట్లలో పెళ్లి అని చెప్పి గంజాయి ట్రాఫికింగ్ కు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు

ఆదివారం బాపట్లలో పెళ్లి ఉందని అబద్ధం చెప్పి తమ స్నేహితుడి కారు తీసుకొని వైజాగ్ వెళ్లారు. అక్కడ వారు అరకు లోయకు వెళ్ళి కృష్ణ అనే మధ్యవర్తి ద్వారా రెండున్నర కేజీలు గంజాయి తీసుకొని తిరిగి హైదరాబాద్ తిరిగి బయలుదేరారు.వీరికి దారి తెలియక సెల్ ఫోన్ లో జీపీఎస్ ను నమ్ముకొని ప్రయాణిస్తుండగా మధ్యలో జీపీఎస్ సిగ్నల్ కట్ అయ్యింది.దీంతో దారి తప్పి ప్రయాణం చేస్తున్న వీరిని పోలీసులు ఆపారు.

పోలీసుల కార్డెన్ సెర్చ్ .. పట్టుబడిన విద్యార్థులు

పోలీసుల కార్డెన్ సెర్చ్ .. పట్టుబడిన విద్యార్థులు

అక్కడ అదే సమయంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి యువకులు కారు రివర్స్ తీసుకొని హడావిడిగా వెళ్ళే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే యువకుల వాహనాన్ని వెంబడించి తనిఖీ చేశారు. దీంతో విద్యార్థులు చేస్తున్న దందా బయటకు వచ్చింది . కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, విద్యార్థులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.

English summary
four students who were addicted to bad habits were expected to smuggle marijuana and sell it to students for easy money. Engineering students from Hyderabad Bachupalli have been pursuing cannabis as a secret for a few days, they choose a easy way to earn money is the only way to sell marijuana. They are making money with cannabis being supplied to college students. vishakha police caught the students .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X