విశాఖ ఉక్కుపై వైసీపీకి సంకటం- రాజీనామాలా, వాటాల కొనుగోలా ? పెరుగుతున్న ఒత్తిడి

తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కేంద్రంతో అంటకాగుతున్న కారణంతో విశాఖ స్లీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై అధికార వైసీపీ ఒత్తిడిలోకి జారుకున్నట్లు కనిపిస్తోంది. వైజాగ్‌ స్లీల్‌పై రోజురోజుకూ ఉదృతమవుతున్న ఆందోళనలు విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో సీఎం జగన్‌ కూడా ప్రైవేటీకరణ విరమించుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. గతంల కడప స్టీల్ ప్లాంట్‌ విషయంలో తామే చేపడతామంటూ ముందుకొచ్చిన వైసీపీ సర్కారు ఇప్పుడు విశాఖ స్లీల్‌లో వాటాలు కొనుగోలు చేస్తుందా లేక తాము కూడా టీడీపీ బాటలోనే రాజీనామాలు చేసి బీజేపీపై ఒత్తిడి పెంచుతుందా అనేది తేలాల్సి ఉంది.

Recommended Video

    Ram Mohan Naidu Objects To Privatization Of Vizag Steel Plant | Andhra Pradesh
     విశాఖ ఉక్కుపై ఇరుకునపడ్డ వైసీపీ

    విశాఖ ఉక్కుపై ఇరుకునపడ్డ వైసీపీ

    నష్టాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా విశాఖ స్లీల్ ప్లాంట్‌పై కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఏడాదిన్నర లోగా విశాఖ స్లీల్‌ ప్లాంట్‌లో వాటాలను ప్రైవేటు సంస్ధలకు అమ్మేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖకు రాజదాని తీసుకురావడంలో విఫలమైన వైసీపీ ఇప్పుడు స్లీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలతో పూర్తిగా ఇరుకునపడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గే పరిస్ధితి లేకపోవడంతో ఏం చేయాలన్న దానిపై వైసీపీలో తీవ్ర మధనం సాగుతోంది.

     టీడీపీ రాజీనామాల ఒత్తిడి

    టీడీపీ రాజీనామాల ఒత్తిడి

    విశాఖ స్లీల్‌ ప్లా్ంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నేరుగా విమర్శించని టీడీపీ.. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఉద్యమానికి మాత్రం ప్లాన్‌ చేస్తోంది. ఇందులో వైసీపీతో సహా బీజేపీ, జనసేనను ఇరికించేందుకు కూడా వ్యూహరచన చేస్తోంది. అందుకే ఇప్పుడు వారిపై రాజీనామాల అస్త్రం ప్రయోగిస్తోంది. అయితే రాజీనామాల అస్త్రంతో బీజేపీ-జనసేనకు ఎలాంటి ఇబ్బంది లేదు. బీజేపీకి విశాఖలో ఉన్నది ఎమ్మెల్సీ మాత్రమే. జనసేనకు అది కూడా లేదు. కానీ వైసీపీ పరిస్ధితి అలా కాదు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ప్రజాప్రతినిధుల చిట్టానే ఉంది. దీంతో టీడీపీ వీరిపై రాజీనామాల అస్త్రం ప్రయోగిస్తోంది.

     మూకుమ్మడి రాజీనామాలకు ఒత్తిడి

    మూకుమ్మడి రాజీనామాలకు ఒత్తిడి

    ఇప్పటికే విశాఖ స్లీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ ప్రకటించారు. ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉన్న గంటా శ్రీనివాస్ రాజీనామాతో ఇప్పుడు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయాలని జనం, ప్రజా, ఉద్యోగసంఘాలు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో మూకుమ్మడి రాజీనామాల డిమాండ్‌ పెరుగుతోంది. ఇది అంతిమంగా వైసీపీకి ముప్పుగా పరిగణమించబోతోంది. ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప నిరసనల సెగ తగలకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని అధికార పార్టీ నేతలకు అర్ధమవుతోంది.

     రాజీనామాలా ? వాటాల కొనుగోలా

    రాజీనామాలా ? వాటాల కొనుగోలా

    టీడీపీతో పాటు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు పెంచుతున్న ఒత్తిడితో ఇవాళ కాకపోతే రేపయినా వైసీపీ విశాఖ స్లీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన వైఖరి ప్రకటించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో మిగతా పార్టీలతో కలిసి రాజీనామాలు చేయడమా లేక స్లీల్‌ ప్లాంట్‌పై కేంద్రం ప్రైవేటీకరించే వాటాలు కొనుగోలు చేయడమా అన్న ప్రశ్న వైసీపీ సర్కారుకు తలెత్తుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీ ట్రాప్‌లో పడి రాజీనామాలు చేసే పరిస్ధితి లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖ స్లీల్ ప్లాంట్ వాటాలు కొనుగోలు చేసే స్తోమత కూడా లేదు. దీంతో స్లీల్ ప్లాంట్‌పై ఏ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మేలు జరుగుతుందనే అంశంపై వైసీపీ చర్చలు జరుపుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+