విశాఖ వాసుల గుండె పగిలే వార్త..!స్టైరిన్ గ్యాసే కాదు, విషవాయువులు కూడా ఉన్నాయన్న పీసీబి..!

అమరావతి/హైదరాబాద్ : విషవాయువుతో విలవిలలాడుతున్న విషాఖ వాసులకు మరోసారి విషాదంలో మునిగే వార్త తెరమీదకు వచ్చింది. విషవాయువు ప్రభావం ఇంకెంత కాలం వెంటాడుతుంది, ఏరూపంలో ఎలాంటి నష్టం కలిగిస్తుంది, ఎలాంటి రుగ్మతకు, వ్యాధులకు కారణమవుతుందని విషాఖ వాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో మూలిగే నక్క మీద కొబ్బరికాయ పడ్డట్టు కాలుష్య నియంత్రణ మండలి మరో చేదు వార్తను విశాఖ వాసులకు వినిపిస్తోంది. దీంతో ఏ క్షణం ఏంజరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపున్న విశాఖ ప్రజలను మరింత విస్మయానికి గురి చేసారు పీసిబీ అధికారులు.

విశాఖ వాసులకు మరో చేదు వార్త.. స్టైరిన్ తో పాటు విషవాయువులు బయటకొచ్చాయన్న పీసిబి..

విశాఖ వాసులకు మరో చేదు వార్త.. స్టైరిన్ తో పాటు విషవాయువులు బయటకొచ్చాయన్న పీసిబి..

హృదయ విదారక విశాఖ గ్యాస్ లీక్‌ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం, మరో వైపు విశాఖ విషవాయువు మీద కూడా పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విశాఖ విషాద సంఘటన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరింత కష్టాలను కొనితెచ్చినట్టైంది. విశాఖ విషవాయువు దుర్ఘటనలో పన్నెండు మంది అభాగ్యులు మృతి చెందగా, దాదాపు వంద మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. విషవాయువు ప్రమాదం బారిన పడ్డ వారి ఆరోగ్యం దీర్ఘకాలంగా ఏదో ఒక సమస్యకు గురవుతుందని, ఎక్కువగా చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నట్టు వైద్య నిపుణులు నిర్ధారిస్తున్నారు.

తనిఖీలు చేస్తున్న కాలష్య నియంత్రణ అధికారులు.. వెలుగు చూస్తున్న అనేక అంశాలు..

తనిఖీలు చేస్తున్న కాలష్య నియంత్రణ అధికారులు.. వెలుగు చూస్తున్న అనేక అంశాలు..

అంతే కాకుండా ఎల్జీ పాలిమర్స్ నుండి బయటకు వచ్చింది విషవాయువు మాత్రమేనని ఇప్పటివరకూ అందరూ భావించారని, కానీ మరో భయంకరమైన అంశం కూడా దాగుందని వాతావరణ కాలుష్య నియంత్రణ అధికారులు నిర్ధారిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఒక్క స్టైరిన్ వాయువనే భ్రమలో ప్రజలు ఉన్నారని, అలా కాకుండా మరికొన్ని విషవాయువులు కూడా విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఇదే అంశం పట్ల విశాఖ వాసులు మరింత భయ భ్రాంతులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో 80 శాతం వరకూ అత్యధిక గాడతతో స్టైరిన్ ఆవిరి, 20 శాతం ఇతర వాయువులు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అధికారులు.

విషవాయువు వల్ల అనేక దుష్ప్రయోజనాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్లు..

విషవాయువు వల్ల అనేక దుష్ప్రయోజనాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్లు..

సంస్థ పరిసరాల్లో స్టైరిన్‌తో పాటు పలు హైడ్రోకార్బన్ల జాడను గుర్తించారు కాలూష్య నియంత్రణ అధికారులు. వాటన్నింటినీ కలిపి టోటల్ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్‌గా (TVOC)పేర్కొన్నారు. ట్యాంకులో ఉష్టోగ్రత పెరిగిన కారణంగా స్టైరిన్ రసాయనిక చర్యకు గురై పాలిమరైజేషన్ చెందిందన్న విషయాన్ని కూడా తిరిగి కాలుష్య నిపుణులు నిర్దారించారు. ఈ ప్రక్రియలో విడుదలైన స్టైరిన్‌ ఆవిరిలో బెంజీన్, ఇథలీన్ తదితర వాయువులున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఒక్క స్టైరిన్ వాయువే కాదని, మరికొన్ని విషవాయువులు కూడా విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది.

Recommended Video

    Gas Leak in Telangana's Sirpur Kagaznagar Paper Mill After Vizag Lg Polymers
    20 పరిశ్రమల్లో తనిఖీలు.. నాణ్యత పాటించని కంపెనీలపై కొరడా..

    20 పరిశ్రమల్లో తనిఖీలు.. నాణ్యత పాటించని కంపెనీలపై కొరడా..

    ఇందులో 80 శాతం వరకూ అత్యధిక గాడతతో స్టైరిన్ ఆవిరి ఉందని ఇది గాలిలో కలిసిన తర్వాత కొద్ది సేపటికి ద్రవరూపంలో మారిపోయి భూమికి చేరుతుందని స్పష్టం చేసారు. అయితే రసాయనాలను భారీగా వినియోగంచే సంస్థలు సాధారణంగా నిపుణుల్ని నియమించుకుంటాయి. ఈ నిపుణులే నిత్యం రసాయనాలకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించి పై ఉద్యోగులకు సమాచారం అందిస్తారు. ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు చెప్పగలుగుతారు. అయితే ఈ ఘటనలో అక్కడ రసాయన శాస్త్రవేత్తలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. కాగా ఈ ప్రమాదంతో అప్రమత్తమయిన అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి విశాఖలోని 20 కర్మాగారాల్లో తనిఖీలు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+