వద్దంటే వాన.. మరో అల్పపీడనం, 24 గంటల్లో జోరు వాన

వర్షాలు వరదలతో ఇప్పటికే జనం అల్లాడిపోయారు. కొందరికీ నిలువ నీడ లేకపోగా.. మరికొందరికీ తినడానికి తిండి లేదు. కరెంట్ నిలిపివేయడంతో.. చిమ్మ చీకట్లో ఉండిపోయారు. వారం తర్వాత వర్షం వెలసింది కదా అనుకున్నాం.. కానీ వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి వార్త చెప్పింది. అదే అల్పపీడనం ఉందని చెప్పడంతో బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే మళ్లీ వానలా అని జనం అనుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు అంతా సద్దుమణగలేదు.

 Rain alert:next 24 hours rain lashes in andhra pradesh

ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవనద్రోణి ఉత్తర ఒడిశా మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై మోస్తరుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బలహీనపడి...మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+