విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందాల అరకు మార్గంలో విరిగిపడిన కొండచరియలు, నిలిచిన రైళ్ళ రాకపోకలు, పర్యాటకుల ఇక్కట్లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రా ఊటీగా పేరెన్నికగన్న అరకు ప్రకృతి సోయగాలతో ఈ సీజన్లో స్వాగతం పలుకుతోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే అరకు కరోనా మహమ్మారి దెబ్బకు పర్యాటకులు లేక కళావిహీనంగా మారింది. మళ్లీ ఇప్పుడు అరకు అందాల లోయలు పర్యాటకులను స్వాగతిస్తోంది. బొర్రా కేవ్స్ నుంచి బృందావనం పార్క్, కాఫీ తోటల నుండి ఆదివాసి మ్యూజియం వరకు ఎన్నో వింతలూ విశేషాలతో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే అరకు అందాలు ఇంతింత అని చెప్పడానికి వీలు కాదు.

చలికాలంలో అరకు అందాలు... సహజత్వం ఉట్టిపడే అందాల ఆంధ్రా ఊటీ

చలికాలంలో అరకు అందాలు... సహజత్వం ఉట్టిపడే అందాల ఆంధ్రా ఊటీ


అంత అద్భుతమైన పర్యాటక స్థలానికి ఇప్పుడిప్పుడే పర్యాటకులు వెళుతున్నారు . ఇటీవల కాలంలో పర్యాటకుల తాకిడి అరకుకు బాగా పెరిగింది. ఈ సీజన్ లో పూసే వలిసె పూల అందాలను చూడటానికే అక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తూ ఉంటారు. సహజ సిద్ధమైన అరకు అందాలకు తోడు వలిసె పూల అందాలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. కొత్తవలస కిరండల్ మార్గంలో నడిచే ఏకైక ప్యాసింజర్ రైల్లో ప్రయాణం చేస్తూ అరకు అందాలను చూడడానికి ఎంతో మంది ఇష్టపడతారు. అరకు లోయ అందాలు ఇంతింత అని వర్ణించటానికి వీలు కాదు. సహజత్వం ఉట్టిపడే గిరిజనులు, సహజ సిద్దమైన ప్రకృతి సౌందర్యం వెరసి అరకు అని అంతా చెప్పుకుంటారు.

 రైల్లో వెళ్తేనే కళ్ళకు కట్టినట్టు అరకు అందాలు

రైల్లో వెళ్తేనే కళ్ళకు కట్టినట్టు అరకు అందాలు

రైలు ప్రయాణమే అరకు అందాలను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. మార్గ మధ్యలో ఎన్నో మధురానుభూతులను పంచుతూ రైలు ప్రయాణం అద్భుతంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సీజన్లో చాలామంది అరకును చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ మధ్య కాలంలో అరకు మార్గంలో అందాలను చూపించడానికి అద్దాల బోగీలతో ట్రైన్ కూడా ట్రయల్ రన్ ను పూర్తిచేసుకుంది. త్వరలోనే అద్దాల బోగీలు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించనున్నాయి.

 రైలు మార్గంలో విరిగిపడిన కొండచరియలు .. అరకు మార్గంలో నిలిచిన రైళ్ళు

రైలు మార్గంలో విరిగిపడిన కొండచరియలు .. అరకు మార్గంలో నిలిచిన రైళ్ళు


అలాంటి అరకు రైలు మార్గం లో చోటు చేసుకున్న ఘటనతో ప్రస్తుతం అరకు వెళ్ళిన పర్యాటకులు కాస్త నిరాశ చెందారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే విశాఖ అరకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస కిరండల్ మార్గంలో చిమిడి పల్లి 66వ కిలోమీటర్ వద్ద కొండరాళ్లు జారి రైల్వే ట్రాక్ పై పడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున కేకే లైన్ లో బండ రాళ్ళు జారి పడటంతో అరకు వెళ్ళే రైలు మార్గం నిలిచిపోయింది. ఇక విద్యుత్ లైన్ల పైన కూడా బండరాళ్లు పడడంతో విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లు సమాచారం. ముందే గుర్తించిన అధికారులు రైళ్ళ రాకపోకలు నిలిపివెయ్యటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Recommended Video

Araku Valley మండల కేంద్రంలో వాహనదారుల అవస్థలు | Visakhapatnam

కొండరాళ్ళను తొలగిస్తున్న రైల్వే సిబ్బంది .. ఇబ్బంది పడుతున్న పర్యాటకులు

దీంతో ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొత్తవలస కిరండల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేసి సహాయక చర్యలను చేపట్టారు. కొండ రాళ్ళను తొలగించడానికి యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు ఎంతో ఆశగా వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నా సరే ఈ మార్గాన్ని పునరుద్ధరించడానికి రైల్వే సిబ్బంది పెద్దఎత్తున పనిచేస్తున్నారు. ఈ రైలు మార్గం పునరుద్ధరణ జరిగితేనే అరకు అందాలను పూర్తిగా చూడడానికి అవకాశం ఉంటుంది.

English summary
Train traffic was halted due to broken landslides on the way to Araku . Tourists who want to see the Araku beauty from the train, which looks very special in this season, are disappointing and facing problems by the lack of trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X