విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ఉక్కు ఉద్యమం 250వ రోజు: 250 మందితో 25 గంటల నిరాహార దీక్ష, భవిష్యత్ ప్లాన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పోరాటం కొనసాగుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొనసాగుతున్న ఉద్యమం 250 వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఇప్పటివరకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పునరాలోచన చేసిన దాఖలాలు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని కేంద్రం పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది.

250 వ రోజుకు దీక్ష .. 250 మందితో 25 గంటల పాటు నిరాహార దీక్ష

250 వ రోజుకు దీక్ష .. 250 మందితో 25 గంటల పాటు నిరాహార దీక్ష

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం 250 వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు 250 మందితో 25 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి నిర్ణయించింది. కేంద్రం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటానికి ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి, టిడిపి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ప్రారంభమైన దీక్ష

స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ప్రారంభమైన దీక్ష

ఇదిలా ఉంటే ఈరోజు 250 వ రోజు దీక్ష లో భాగంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు ఎదుట 250 మంది కార్యకర్తలతో దీక్ష ప్రారంభమైంది. దీక్షలకు బిజెపి మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ సంఘీభావం తెలపగా కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దని, కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేయాలి అన్న దానిపై అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి .

రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ, నవంబర్ 1 న మహా ర్యాలీ

రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ, నవంబర్ 1 న మహా ర్యాలీ

విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 1న విశాల ప్రజా ఉద్యమంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాటాన్ని నిర్వహించాలని జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది.
నవంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఏబీఎన్ కాలేజ్ నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు మహా ర్యాలీ జరుగుతుందని దీనిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలంతా పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది. అంతేకాదు స్థానిక సంస్థలు అన్నింటిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక తీర్మానాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయించడం ద్వారా ప్రజా ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని మార్చాలని రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నిర్ణయించింది.

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాలు

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాలు

విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులను ఇప్పటికే కలిశామని ఆ దిశగా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా పోరాటం సాగించేలా, కేంద్రంపై రాజకీయ వర్గాల ద్వారా ఒత్తిడి పెంచేలా చూడాలని కూడా ఉక్కు పరిరక్షణా పోరాట సమితి భావిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు ముందుకు వేస్తున్న కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు ముందుకు వేస్తున్న కేంద్రం

ఇప్పటికి రెండు వందల యాభై రోజులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతున్నా, ఏకంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక గళాన్ని కార్మికులు వినిపించినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. ప్రైవేటీకరణ చేసి తీరుతామని తేల్చి చెప్తుంది .

ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినా, పార్లమెంటు సాక్షిగా ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా బాధ్యత అధికార వైసీపీ తీసుకోవాలని ప్రతిపక్ష టీడీపీ వాదిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అవసరం అయితే టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తామని, వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని పట్టుబట్టింది.

Recommended Video

India Coal Crisis : ఆదుకున్న Hydropower, AP జల విద్యుత్‌ ప్రాజెక్టుల Status || Oneindia Telugu
 అలుపెరుగని పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు

అలుపెరుగని పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు

ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం మార్చుకునేది లేదని ఇప్పటికి అనేక మార్లు తేల్చిచెప్పిన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలు, మేధావులు, విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు అందరి ముందున్న పెద్ద ప్రశ్న. ఆందోళనల ద్వారా ఎప్పటికైనా కేంద్రం మెడలు వంచుతామని భావిస్తున్న విశాఖ ఉక్కు కార్మికులు అలుపెరగకుండా చేస్తున్న ఈ పోరాటంలో కేంద్రం మనసు మార్చుకునేలా చేయగలరా అన్నది పెద్ద ప్రశ్నే.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క రాజధాని అమరావతి కోసం సాగుతున్న ఉద్యమం, మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం రెండూ సుదీర్ఘంగానే సాగుతున్నట్లుగా తాజా పరిణామాలతో కనిపిస్తుంది.

English summary
As the steel plant movement reached its 250th day, 250 people went on a 25-hour hunger strike today. He said the movement would continue until the Center changes its decision on privatization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X