విశాఖ ఉక్కు ఉద్యమ కార్యాచరణ ... ఛలో జంతర్ మంతర్, వైఎస్ జగన్ కు నేతల డిమాండ్ !!
విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడంతో విశాఖ ఉక్కు ఉద్యమం మరోమారు ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తాజాగా భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ఇదే సమయంలో ఏపీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 2,3 వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం వంద రోజులకు పైగా ఆందోళనలు చేపట్టిన విశాఖ ఉక్కు కార్మికులు తాజాగా కేంద్రం వైఖరితో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తేనే కేంద్రం దిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2,3 వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరాలని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు.

పార్లమెంట్ ను స్తంభింపజేసే ఆలోచన
కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం కోసం రానున్న రోజుల్లో ఢిల్లీ స్థాయిలో ఉద్యమించాలని, పార్లమెంటును స్తంభింప చేయాలని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు . ఇక వైసీపీ ఎంపీలు సైతం పార్లమెంట్ వేదికగా తమ నిరసన గళం వినిపించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి పోరాటం చేయడానికి ఒత్తిడిని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ కు జలవివాదాలతో పాటు పరిష్కారం కాని అనేక సమస్యలు ఉండగా తాజాగా విశాఖ స్టీల్ ఉద్యమం కూడా ఇబ్బంది పెడుతుంది .

జూలై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టాలని సిపిఐ తీర్మానం
ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సిపిఐ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నేడు ఏర్పాటు చేసింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జూలై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టాలని సిపిఐ తీర్మానం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ వంద రోజులకు పైగా కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నా కేంద్రం తీరు నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉందని, అందుకే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

సీఎం జగన్ కూడా నిరసనల్లో పాల్గొనాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్
విశాఖ ఉక్కు విషయంలో ఒంటెద్దు పోకడలు పోతుందని కేంద్రం తీరుపై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడం లేదని ఏపీ బీజేపీ నేతలు ప్రజలను మభ్య పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకపక్క కేంద్రం అడుగులు వేస్తున్నా బీజేపీ నేతలు మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చెయ్యటం దారుణం అన్నారు. సీఎం జగన్ పై కూడా ఒత్తిడి పెంచాలని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొనాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications