విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అవమానించలేదు, నేనే దిగిపోయా.. సిగ్గు శరం లేకుండా మోకరిల్లారు.. ఎల్జీ పాలిమర్స్‌లో విజయసాయి..

|
Google Oneindia TeluguNews

స్టెరీన్ గ్యాస్ లీకేజీ షాక్ నుంచి విశాఖపట్నం శివారు గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఒకదిక్కు కేంద్ర సంస్థలు తీవ్రస్థాయి హెచ్చరికలు చేస్తున్నా.. ఏపీ సర్కారు మాత్రం ప్రజల్ని ఊళ్లకు తిరిగి పంపేస్తున్నది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ కొలువైన ఆర్ఆర్ వెంకటాపురంతోపాటు మొత్తం ఆరు ప్రాభావిత గ్రామాల ప్రజలు క్యాంపుల నుంచి మంగళవారం నాటికి ఇళ్లకు చేరుకున్నారు. గ్రామల్లో గ్యాస్ ప్రభావం లేదని ప్రజలకు భరోసా కల్పించేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాత్రి అక్కడే నిద్ర చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఎల్జీ ప్లాంటును సందర్శించారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి సంచలన కామెంట్లు చేశారు.

విశాఖ విషాదం: కేంద్రం సంచలన ఆదేశాలు.. రాష్ట్రాలకు వార్నింగ్.. టార్గెట్ అంటే తాటతీసుడేనట.. విశాఖ విషాదం: కేంద్రం సంచలన ఆదేశాలు.. రాష్ట్రాలకు వార్నింగ్.. టార్గెట్ అంటే తాటతీసుడేనట..

గ్యాస్ ప్రభావం నుంచి గ్రీన్ జోన్‌గా..

గ్యాస్ ప్రభావం నుంచి గ్రీన్ జోన్‌గా..

ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో విషపూరిత స్టెరీన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల గ్రామాల్లోని 12 మంది చనిపోవడం, వందల మంది అస్వస్థతకు గురికావడం, వందలాది మూగజీవాలు కూడా చనిపోవడం తెలిసిందే. కాగా, ఆదివారం నాటికే గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టేశామని, ఇక ప్రజలకు ఎలాంటి భయాలు అవసరం లేదని ఎల్జీ సంస్థ ప్రకటించింది. దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆరు గ్రామాల ప్రజల్ని తిరిగి ఇళ్లకు పంపేందుకు ప్రభుత్వా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు తప్ప మిగతావాళ్లంతా ఇళ్లకు చేరుకున్నారని విజయసాయి చెప్పారు. మంగళవారం ప్లాంటును సందర్శించిన ఆయన.. స్టెరీన్ లీకైన ట్యాంకర్ దగ్గరికెళ్లి పరిశీలించారు. గ్యాస్ ప్రభావిత ప్రాంతాన్ని చక్కటి గ్రీన్ జోన్ గా మార్చేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎంపీ తెలిపారు.

కారు దిగిన ఘటనపై..

కారు దిగిన ఘటనపై..

విశాఖపట్నం తాను దత్తత తీసుకున్న జిల్లా అని, ఇక్కడి వ్యవహారాలను ఎప్పుడూ మిస్ కాబోనని పదే పదే చెప్పే ఎంపీ విజయసాయి.. గ్యాస్ లీకేజీ ఘటనపై అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా, సీఎం జగన్ కావాలనే విజయసాయిని దూరం పెట్టారని, అందుకే విశాఖ పర్యటన సందర్భంలో కారు నుంచి ఎంపీని దించేశారని జోరుగా ప్రచారం సాగింది. తనపై తప్పుడు ప్రచారారాలు సాగుతున్నాయంటూ సైబర్ క్రైమ్ విభాగానికి సైతం ఫిర్యాదు చేసిన విజయసాయి.. ఈ వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. విశాఖలో గురువారం గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగితే, సోమవారం దాకా ఇక్కడికి ఎందుకు రాలేదన్న విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ అసలేం జరిగిందో వివరించారు..

జగన్ కాదు నేనుగా..

జగన్ కాదు నేనుగా..


‘‘నిజానికి ప్రమాదం జరిగిన రోజే ముఖ్యమంత్రితో కలిసి నేను వైజాగ్ రావాల్సింది. అప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా వైజాగ్ బయలుదేరారు. హెలికాప్టర్‌లో సరిపడా చోటు లేనందువల్ల నాకు నేనుగా వెనక్కి తగ్గాను. నాకంటే కూడా ఆరోగ్య మంత్రి వైజాగ్ వెళ్లడం ముఖ్యమని భావించాను కాబట్టే నేనా నిర్ణయం తీసుకున్నాను. హెల్త్ మినిస్టర్ ను పంపేదుకే నేను కారు దిగాను తప్ప ఇందులో సీఎం జగన్ నన్ను అవమానించిందేమీ లేదు. కానీ దీనిపై కొందరు కావాలని ఇష్టమొచ్చినట్లు రాతలు రాశారు. ప్రధానంగా ఎల్లో మీడియా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేసింది. ఇంత చిన్న విషయానికి అనవసర రాజకీయాలు తగదు''అని విజయసాయి వివరణ ఇచ్చారు.

Recommended Video

Kodali Nani Trashes Out Chandrababu Comments On 1Cr Ex Gratia | Oneindia Telugu
సిగ్గూ శరం లేదు..

సిగ్గూ శరం లేదు..


ఎల్జీ పాలిమర్స్ సంస్ధతో సీఎం జగన్, ఎంపీ విజయసాయి కుమ్మక్కయ్యారని, లాక్ డౌన్ ఎత్తివేతకు ముందే అక్రమంగా అనుమతులు ఇవ్వడం వల్లే గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిందని ప్రతిపక్ష టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్.. విజయసాయిని కారు దించేసిన ఘటనపైనా టీడీపీ శ్రేణులు విమర్శలు సంధించారు. అందరికీ కలిపి వైసీపీ ఎంపీ తనదైన స్టైల్లో ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు దిగజారుడు తనాన్ని గుర్తుచేస్తూ.. ‘‘విధి ఎంత నిర్ధయగా ఉంటుందంటే... మోదీ గోబ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన చంద్రబాబు.. అమిత్ షా కుటుంబంతోసహా తిరుపతి వస్తే కాన్వాయ్ పై రాళ్లేయించిన అదే బాబు.. ఏడాది తిరగక ముందే సిగ్గు శరం లేకుండా ఆ ఇద్దరు నేతల ముందు మోకరిల్లాడు.. వైజాగ్ వెళ్లడానికి అనుమతివ్వండంటూ వేడుకున్నాడు..'' అని ఎంపీ ఫైరయ్యారు.

English summary
amid visakhapatnam gas leakage along with ministers and party mlas ysrcp mp vijay sai reddy visits LG polymers plant on tuesday. while speaking with media mp clarified why he was stepped down from cm jagans car and slams chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X