విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఆత్మహత్య-ఫర్నేస్‌లో దూకుతానని ఉద్యోగి లేఖ-హై టెన్షన్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నగరంలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం కార్మికులు ఆందోళన బాట పట్టగా.. ఇప్పుడు ఏకంగా ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. దీంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఆందోళన నెలకొంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రయత్నాలకు నిరసనగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ లేఖ రాశాడు. అనంతరం అదృశ్యం అయ్యాడు. దీంతో సాటి ఉద్యోగులు, కార్మికుల్లో టెన్షన్ నెలకొంది. ఈ లేఖలో శ్రీనివాసరావు ప్రస్తావించిన అంశాలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ఉక్కు ప్లాంట్ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

కార్మికులారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం, ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిభలం ఈ ఉక్కు కర్మాగారం, ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి 5.49 నిమిషాలకు ముహుర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం, ప్రాణత్యాగం నా నుంచి మొదలు కావాలంటూ ఉద్యోగి శ్రీనివాసరావు లేఖ రాసి అదృశ్యమయ్యారు. దీంతో ఇప్పుడు శ్రీనివాసరావు కోసం గాలింపు సాగుతోంది.

-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications