విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..? ఇంకా ఖరారు కానీ ముహుర్తం: విజయసాయిరెడ్డి

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని తెలిపారు. దానికి సంబంధించి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిపాలన రాజధాని తరలింపుకు సంబంధించి సంకేతాలు అందుతున్నాయని వెల్లడించారు.

44 కి.మీ రోడ్ల అభివృద్ది..

44 కి.మీ రోడ్ల అభివృద్ది..

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్టణానికి రాబోతోందని పదే పదే చెప్పడం జరిగిందని, దీనికన్నా ఎక్కువ విషయాలు ఇప్పుడు చెప్పడం సరికాదన్నారు. విశాఖ పరిపాలన రాజధానిపై గతంలో కూడా విజయసాయి రెడ్డి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో 44 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్ల అభివృద్ధి చేయడం, పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది ప్రభుత్వం. కొద్ది రోజుల్లో సీఎం జగన్ ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే ఏర్పాటు

త్వరలోనే ఏర్పాటు

ఎలాంటి పరిపాలన భవనాలు కావాలనే దానిపై అధికార యంత్రాంగం ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. విలువైన ప్రభుత్వ భూములతోపాటు, ఇతర స్థలాలు, భవనాలు ఇక్కడ ఉన్నాయి. కోర్టులో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో పరిపాలన రాజధానిని తరలిస్తే..న్యాయపరంగా చిక్కులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే వీటికి పరిష్కారం లభిస్తుందని.. త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని తరలనుందని భావిస్తున్నారు.

ఇలా వాయిదా..?

ఇలా వాయిదా..?

అమరావతిని శాసన రాజధాని, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం గెజిట్ నోట్ ఇవ్వడంతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించి చట్టాలుగా మారినా..రాజధాని బిల్లులపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో వాయిదా పడుతూ వస్తోంది. కానీ మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ మొండి వైఖరితో ముందుకెళుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+