ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బొబ్బిలి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు విజయంనగరం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి. పునర్విభజన తరువాత 9 నియోజకవర్గాలకు కుదించారు. రద్దైన వాటిల్లో తెర్లాం నియోజకవర్గం ఒకటి. బొబ్బిలి మున్సిపాలిటీ..మండలం, రామ భద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. బొబ్బిలి రాజవంశీకులు ఈ నియోజకర్గం లో రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967 లో బొబ్బలి రాజు ఇక్కడి నుండి గెలుపొందారు. తాజాగా, గత మూడు సార్లు అదే రాజకుటుంబీకుడైన సుజయ కృష్ణ రంగారావు గెలుస్తూ వచ్చారు. గతంలో రెండు సార్లు కాంగ్రెస్ నుండి.. 2014 లో వైసిపి నుండి గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఇక్కడ నుండి ప్రభావం చూపింది. తెర్లాం నియోజకర్గం నుండి ప్రాతి నిధ్యం వహించిన తెంటు కుటుంబం బొబ్బలి నుండి ప్రాతినిధ్యం వహించారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
బొబ్బిలి నియోజకవర్గం 1952 లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి మూడు సార్లు,జనతా..సోషలిస్టు పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. 2014 లో వైసిపి ఒక సారి గెలిచింది. టిడిపి నేత శం భంగి చిన అప్పలనాయుడు బొబ్బలిలో మూడు సార్లు గెలిచారు. మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన రావు రెండు సార్లు గెలిచారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..ఆ తరువాత
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 211986 ఓట్లు ఉండగా, అందులో 167519 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన సుజయ రంగారావు కు 83587 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన లక్ష్మానాయుడుకు 76629 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి సుజయ రంగారావు 6958 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గెలిచి వైసిపి ఎమ్మెల్యేగా...జగన్ కు సన్నిహితంగా ఉండే సుజయ రంగారావు ఆ తరువాతి కాలంలో టిడిపి లోకి ఫిరాయించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయనకు మంత్రి పదవి దక్కింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన గనుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు వైసిపి నుండి విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఇప్పుడు ఇద్దరు సోదరులు టిడిపిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications