ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లే ఎన్నిక‌లు జ‌రిగాయి. భోగాపురం, పూస‌పాటిరేగ‌, నెల్లిమ‌ర్ల‌, డెంకాడ మండ‌లాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. అంతకు ముందు ఈ ప్రాంతాల‌తో ఉన్న స‌తివాడ‌, భోగా పురం నియోజ‌క‌వ‌ర్గాలు 2009 లో ర‌ద్ద‌య్యాయి. 2009 లో బొత్సా మేన‌ల్లుడు ఇక్క‌డి నుండి పోటీ చేసి ఆరు సార్లు శాస‌న‌స‌భ కు ఎన్నికైన ప‌తివాడ నారాయ‌ణ స్వామి నాయుడుని ఓడించారు. ఇక స‌తివాడ నియోజ‌క‌వ‌ర్గం నుండి పెన్మ‌త్స సాంబ‌శి వ‌రాజు కాంగ్రెస్ నుండి ఆరు సార్లు ఎన్నిక‌య్యారు. అంతుకు ముందు ఉన్న భోగాపురం నియోజ‌కవ‌ర్గం నుండి కొమ్మూరు అప్ప‌డుదొర కాంగ్రెస్ నుండి నాలుగు సార్లు గెలిచారు. టిడిపి నుండి స్వామినాయుడు వ‌రుస‌గా ఆరు సార్లు గెలుపొందారు . ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి రాజ‌కీయా స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి.

నెల్లిమ‌ర్ల లో రెండు సార్లు ఎన్నిక‌లు..
2009, 2014 లో నెల్లిమ‌ర్లలో రెండు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. 2009 ఎన్నిక‌ల్లో అనూహ్య ప‌రిస్థితుల్లో బొత్సా స‌త్యానారాయ ణ త‌న మేన‌ల్లుడు అప్ప‌ల‌నాయుడును ఇక్క‌డి నుండి కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దింపారు. ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో సీని ర్ ఎమ్మెల్యే అయిన ప‌తివాడ నారాయ‌ణ స్వామినాయుడును ఓడించారు. ఇదే నియోక‌వ‌ర్గానికి చెందిన పెన్మ‌త్స సాంబశివ రావు స‌తిపాడ నుండి ఆరుసార్లు.. గ‌జ‌ప‌తి నగరం నుండి రెండు సార్లు గెలిచి మొత్తంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గా రాష్ట్రంలోనే అత్య‌ధిక సార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికైన నేత‌గా రికార్డు సాధించారు.

#AndhraPradeshElections2019: All about Nellimarla Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 189233 ఓట్లు ఉండ‌గా, అందులో 169573 ఓట్లు పోల‌య్యాయి. అందులో టిడిపి నుండి పోటీ చేసిన ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి నాయుడుకు 71267 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన సూర్య‌నారాయ‌ణ‌కు 64294 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి 6973 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపు ద్వారా ఏడు సార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తో స‌మ‌కాలీకుల‌య్యారు. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలిచిన త‌రువాత ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి నాయుడు ప్రొటెం స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత కోడెల శివ ప్ర‌సాద్ రెగ్యుల‌ర్ స్పీక‌ర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+