ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా జ‌న‌ర‌ల్ కేట‌గిరీ నుండి ఎస్సీ కోట‌గిరీకి మారింది. బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గం లోని సీతాన‌గ‌రం మండ‌లాన్ని ఈ నియోజ‌వ‌ర్గంలో క‌లిపారు. బ‌లిజ‌పేట‌, మ‌క్కువ మండ‌లాలు పార్వీపురం నియోక‌వ‌ర్గం లో చేరాయి. 2004 లో ఇక్క‌డి నుండి గెలిచిన శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ రాజు రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గంగా మార‌టంతో శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నుండి పోటీ చేసి గెలుపొందారు. విజ‌య‌రామ రాజు ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. లోక్‌స‌భ కు సైతం ఎన్నికైన రికార్డు అయ‌న‌కు ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలిచిన చీక‌లి ప‌రుశురామానాయుడు అంజ‌య్య క్యా బినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన జ‌య‌మ‌ణి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల్లో టిడిపి - వైసిపి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ జ‌రిగింది.

16 సార్లు ఎన్నిక‌లు.. రెండు పార్టీల‌కే ప్రాధాన్యం..
పార్వ‌తీ పురం నియోజ‌క‌వ‌ర్గం లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్ం 16 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి ఆరు సార్లు, స్వ‌తంత్ర‌-జ‌న‌తా పార్టీలు ఒక్కో సారి గెల‌వ‌గా, స్వ‌తంత్ర అభ్య‌ర్దులు రెండు సార్లు గెలుపొందారు. ఇక ఇక్క‌డి నుండి గెలిచిన ప్ర‌ముఖుల్లో ఎర్రా కృష్ణ‌మూర్తి, ప‌రుశురామ నాయుడు రెండేసి సార్లు ఇక్క‌డి నుండి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2004 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ రాజు వైయ‌స్ క్యాబినెట్ లో ఆ త‌రువాత రోశ‌య్య క్యా బినెట్‌లోనూ మంత్రిగా ప‌ని చేసారు. 2009 లో పార్వతీ పురం నుండి పోటీ చేసిన రిట్ట‌ప‌ల్లి ల‌త‌కు 11 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

#AndhraPradeshElections2019: All about Parvathipuram Constituency

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 173905 ఓట్లు ఉండ‌గా, అందులో 129448 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బొబ్బ‌లి చిరంజీవులుకు 62498 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ప్ర‌స‌న్న కుమార్ కు 56239 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన జోగారావుకు కేవ‌లం 6911 ఓట్లు వ‌చ్చాయి. 2009 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్య‌ర్ధి చేతిలో ఓడిపోయిన చిరంజీవులు 2014 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. 2009 నుండి ఎస్సీ రిజ‌ర్వ్ నియోజ‌క వ‌ర్గంగా మార‌టంతో ఇక్క‌డ తిరిగి ప‌ట్టు సాధించేందుకు రెండు ప్ర‌ధాన పార్టీలు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+