ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సాలూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
గిరిజన నియోజకవర్గమైన సాలూరు లో 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సాలూరు, మక్కువ మండలా లు పూర్తిగా సాలూరు నియోజకవర్గంలో చేరాయి. పలువురు గిరిజన నేతలు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిం చారు. కుల దృవీకరణ కేసులు..కోర్టు తీర్పుల ద్వారా ఎమ్మెల్యే అవ్వటం ఇక్కడ చోటుచేసుకున్న అరుదైన ఘటనలు. ఈ నియోజకవర్గంలో ఆర్పీ భాంజ్‌దేవ్ మూడు సార్లు గెలిచారు. పిడకల రాజన్నదొర కాంగ్రెస్ నుండి ఒకసారి ..వైసిపి నుండి ఒకసారి గెలుపొందారు. 2009 లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాని అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసారు. కాంగ్రెస్ -టిడిపి మధ్య ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రాజకీయ పోరు నెలకొని ఉంది.
14 సార్లు ఎన్నికలు.. కోర్టు తీర్పులు..
సాలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అయిదు సార్లు కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపొందారు. టిడిపి అయిదు సార్లు గెలిచింది. స్వతంత్ర అభ్యర్ధులు రెండు సార్లు గెలవగా, సిపిఐ-పిఎస్పి- కెఎల్‌పి ఒక్కో సారి గెలుపొందాయి. ఇక్కడి నుండి 2004 లో టిడిపి అభ్యర్దిగా భంజ్‌దేవ్ గెలుపొందగా, ఆయన పై పోటీ చేసిన రాజన్న దొర కోర్టు కు వెళ్లారు. ఆ ఎన్నిక పై కోర్టుకెళ్లిన రాజన్న దొర ను కోర్టు 2004-2009 ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీంతో, 2007 లో ఆయన ఎమ్మెల్యే అ య్యారు. 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్దగా రాజన్న దొర టిడిపి అభ్యర్ది పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి 13,479 ఓట్లు సాధించారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 175174 ఓట్లు ఉండగా, అందులో 133372 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన పిడకల రాజన్నదొర కు 63755 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ధి భంజ్ దేవ్ కు 58758 ఓట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ది రాజన్నదొర 4997 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భంజ్‌దేవ్ గతంలో ఇదే నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా..రాజన్నదొర కు ఇది మూడో సారి గెలుపు. ఈ నియోజకవర్గం అరకు లోక్‌సభ పరిదిలోకి వస్తుంది.












Click it and Unblock the Notifications