ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శృంగ‌వ‌ర‌పుకోట నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2004 వ‌ర‌కు గిరిజ‌నుల‌కు రిజ‌ర్వ్ గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం 2009 లో జ‌న‌ర‌ల్ గా మారింది. ఉత్త‌రాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం లో ఉన్న కొత్తవ‌ల‌స మండ‌లం ఈ నియోజ‌కవ‌ర్గంలో చేరింది. 1953లో ఏర్ప‌డిని ఆంధ్ర రాష్ట్రంకు తొలి ముఖ్య‌మంత్రి అయి న టంగుటూరి ప్ర‌కాశం పంతులు ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక ద్వారా ఏక‌గ్రీవంగా చ‌ట్ట స‌భ‌లో ప్ర‌వేశించారు. ఇక్క‌డ నుండి ఎల్ బి దుక్కు నాలుగుసార్లు టిడిపి నుండి గెలుపొందారు. మొత్తం ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కోళ్ల అప్ప‌ల‌నాయుడు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి ప్రాతినిధ్యం వ‌హించారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విచిత్ర ప‌రిస్థితి ఎదురైంది. ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ధితో పాటుగా ఆ పార్టీ రెబ‌ల్ అభ్య‌ర్ధి..మ‌రో అభ్య‌ర్ధి ఇద్ద‌రు స్వ‌తంత్రులు ఇక్క‌డ ప్ర‌భావం చూపించారు. ఆ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి విజ‌యం సాధించారు.

16 సార్లు ఎన్నిక‌లు..గిరిజ‌న నేత‌ల గెలుపు
శృంగ‌వ‌ర‌పుకోట కు 1952 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 16 సార్లు ఎన్నిక‌లు జరిగాయి. టిడిపి ఏడు సార్లు, కాంగ్రెస్ అయిదు సార్లు, ప్ర‌జా సోష‌లిస్టు..సోష‌లిస్టు పార్టీలు మూడు సార్లు, స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒక సారి గెలిచారు. 1999 లో ఇక్క‌డి నుండి గెలిచిన శోభా హైమ‌వ‌తి 2004 లో ఓడిపోయారు. తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం తిరుగు బాటు అభ్య‌ర్ధిగా పోటీ చేసిన ర‌ఘురాజ్ పోటి చేసి 31,248 ఓట్లు సాధించారు. మ‌రో స్వ‌తంత్ర అభ్య‌ర్ధి జ‌య ప్ర‌కాశ్ బాబుకు 20,284 ఓట్లు వ‌చ్చాయి. ప్ర‌జారాజ్యం ఆ ఎన్నిక‌ల్లో 19,330 ఓట్లు ద‌క్కించుకుంది. ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి వైసిపి రంగ ప్ర‌వేశం తో స‌మీక‌ర‌ణాలు మారాయి.

Srungavarapukota Constituency

2014 లో టిడిపి గెలుపు..
విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌ర్గంలో 2014 లో మొత్తం ఓట‌ర్లు 202518 ఉండ‌గా ,అందులో 171905 మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అందులో టిడిపి నుండి పోటీ చేసిన ల‌లిత‌కుమారికి..82177 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన జ‌గ‌న్నాధం కు 53605 ఓట్లు వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి 28572 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజ క వ‌ర్గం విశాఖ లోక్‌స‌భ ప‌రిధిలోకి వ‌స్తుంది. 2014 లో అక్క‌డి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపి గెలిచింది. ఇక‌, 2009 లో గెలిచిన ల‌లిత కుమారి టిటిడి బోర్డు స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+