వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూవివాదంలో జోక్యం చేసుకుని బెదిరింపులు ... సిఐ పై కేసు నమోదు, ఏఆర్‌ విభాగానికి అటాచ్‌

|
Google Oneindia TeluguNews

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి బెదిరింపులకి పాల్పడి, అనవసర విషయాల్లో జోక్యం చేసుకున్నారు. ఫలితంగా ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఒక భూమి వివాదంలో తలదూర్చినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీఐపై కఠిన చర్యలకు నిర్ణయం తీసుకున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్.

పోలీసులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు .... ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు .. తస్మాత్ జాగ్రత్త !!పోలీసులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు .... ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు .. తస్మాత్ జాగ్రత్త !!

 భూవివాదంలో సిఐ పై కేసు నమోదు , ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ నిర్ణయం

భూవివాదంలో సిఐ పై కేసు నమోదు , ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ నిర్ణయం

హన్మకొండ వికాస్ నగర్ లోని ఓ స్థలం విషయంలో సీఐ దయాకర్ జోక్యం చేసుకుని తుపాకీతో బాధితుడిని బెదిరించిన్నట్లుగా ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు సిఐ దయాకర్ ముద్దాయిగా మారాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సిఐ పై హత్యాయత్నం, దారిదోపిడి కేసులు కూడా నమోదయ్యాయి , భూ వివాదంలో తలదూర్చినందుకు హనుమకొండ సిఐ దయాకర్ ను ఏఆర్ విభాగానికి అటాచ్ చేస్తూ సి పి ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

భూవివాదంలో ఓ వ్యక్తిని బెదిరించిన హన్మకొండ సిఐ దయాకర్ .. బాధితుడి ఫిర్యాదు

భూవివాదంలో ఓ వ్యక్తిని బెదిరించిన హన్మకొండ సిఐ దయాకర్ .. బాధితుడి ఫిర్యాదు

ములుగు మచ్చాపురానికి చెందిన రవీందర్ రెడ్డికి, నయీం నగర్ ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన సోదా కిరణ్ కు మధ్య వికాస్ నగర్ లోని ఒక స్థలం విషయంలో గత కొంత కాలంగా వివాదం నెలకొంది. కిరణ్ తన పలుకుబడితో రవీందర్ రెడ్డి ని హనుమకొండ పోలీస్ స్టేషన్ కు పిలిపించి బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించారు. దీనికి సీఎం కూడా వత్తాసు పలకడంతో పాటు సంతకం పెట్టుకుంటే సీరియస్ గా ఉంటుందని బెదిరించి కొట్టినట్లుగా రవీందర్ రెడ్డి పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

Recommended Video

Dil Raju Adopts 3 Orphans || తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలని చేరదీసిన Dil Raju | Oneindia
ఘటనపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు .. కఠిన నిర్ణయం తీసుకున్న సీపీ

ఘటనపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు .. కఠిన నిర్ణయం తీసుకున్న సీపీ

కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జి డిసిపి పుష్పా, నర్సంపేట ఏసిపి ఫణీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విచారణ జరిపి సీపీకి నివేదిక ఇచ్చారు.ఈ నివేదిక ఆధారంగా సీఐ దయాకర్ తో పాటు, సోదా కిరణ్, అతని డ్రైవర్ చారి, మరో వ్యక్తిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రవీందర్ రెడ్డి ని కొట్టిన ఘటనలో గన్ మ్యాన్ పాత్ర కూడా ఉన్నట్లు గా గుర్తించి అతడిని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించారని సమాచారం. ఈ కేసులో సీఐ దయాకర్ పాత్ర ఉన్నట్లు తేలడంతో అతనిపై వేటు వేసిన సీపీ, సీపీ కార్యాలయంలో ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
CI Dayakar pleaded guilty to a charge of interfering in a land dispute in Hanmakonda Vikas Nagar and threatening the victim with a gun. Attempted murder and robbery cases have also been registered against the CI on the orders of his superiors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X