వరంగల్ కేంద్రంగా ముంబై ఆన్‌లైన్ బెట్టింగ్ దందా: ఇద్దరు బుకీలు అరెస్ట్; 2కోట్లకు పైగా నగదు స్వాధీనం!!
ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 2కోట్ల పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన అభయ్ అనే ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు వీరి వద్ద నుండి 2.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నిందితుల వద్ద ఉన్న వివిధ బ్యాంకులకు సంబంధించి 43 పాస్ పుస్తకాలను, ఏటీఎం కార్డులను, ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరించారు.

ఆన్ లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలాట బెట్టింగ్ లు
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో హఫీజ్ పేటలో బట్టల వ్యాపారం నిర్వహించే నిందితుడు ప్రసాద్ 2016 నుంచి క్రికెట్, పేకాట బెట్టింగ్ ను ప్రారంభించారని వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. ముంబై కేంద్రంగా ఆన్లైన్ లో బెట్టింగ్ నిర్వహించే మరో నిందితుడు అభయ్ తో ప్రసాద్ కు పరిచయం ఏర్పడగా ఇద్దరూ కలిసి ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వివరించారు.

ముంబై కేంద్రంగా సాగే ఆన్ లైన్ బెట్టింగ్ దందా...ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు బుకీగా ప్రసాద్
అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ద్వారా నిందితుడు ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమించబడ్డాడు. దీనితో ఆన్లైన్ లో బెట్టింగ్ లో పాల్గొనేవారు ముందుగా అన్లైన్ ద్వారా గాని, వ్యక్తిగతంగా కానీ డబ్బు చెల్లించిన వ్యక్తులకు అభయ్ నుండి నిందితుడు ప్రసాద్ కు వచ్చిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను, వాట్సప్ ద్వారా బెట్టింగ్ లో పాల్గొనే వ్యక్తులకు అందజేసేవాడు. వీటి ద్వారా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ లలో పాల్గొనేవారు.

బెట్టింగ్ లో పాల్గొనే వారిని ట్రాప్ చేస్తూ డబ్బు దండుకుంటున్న కేటుగాళ్ళు
ఈ బెట్టింగ్ లో పాల్గొనే వారిని ట్రాప్ చేయడానికి ముందుగా బెట్టింగ్ పెట్టిన వారికి పందెం కాసిన డబ్బుకు రెట్టింపు డబ్బు వచ్చేలా చేసేవారు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ దందాలో వెబ్ సైట్ నిర్వహణ మొత్తం నిందితుల చేతుల్లో వుండటంతో మూడుముక్కల పేకాట, బెట్టింగ్ సమయంలో తక్కువ మొత్తం పందెం పెట్టిన వారిని ముందుగా గెలిపించి వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేవిధంగా ప్రోత్సహించేవారు. ఇలా ఎక్కువ డబ్బును పందెం కాసినప్పుడు వారిని ఓడిపోయే విధంగా చేసి నిందితులు మోసం చేసేవారు. ఈ బెట్టింగ్ లలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనేందుకు నిందితులకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో జైలుకెళ్ళి వచ్చిన బెట్టింగ్ గ్యాంగ్ సభ్యుడు , మళ్ళీ దందా షురూ
బెట్టింగ్ వేసిన వారి నుండి మోసం చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, కమిషన్ పేరుతోనూ వసూలు చేసిన మొత్తాన్ని ఇద్దరు నిందితులు కలిసి పంచుకునేవారు. గతంలోనే ఓ మారు హైదరాబాదులో ఆన్లైన్ బెట్టింగ్ కేసులో పట్టుబడిన నిందితుడు ప్రసాద్ జైలు శిక్షను అనుభవించారు. జైలు నుండి విడుదలైన అనంతరం నిందితుడు హైదరాబాద్ లో తిరిగి అన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు గుర్తిస్తారని తన అత్తగారు నివాసం వుంటున్న హన్మకొండకు నిందితుడు ప్రసాద్ మకాం మార్చాడు.
Recommended Video

హన్మకొండ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
హన్మకొండ కేంద్రంగా చేసుకోని నిందితులు ఐపిఎల్, టి20-20 వర్డల్ కప్ తో పాటు మూడు ముక్కల పేకాట ఆన్‌లైన్ బెట్టింగ్ ను జోరుగా నిర్వహిస్తూ ప్రజలను మోసం చేయడంతో పాటు ఈ బెట్టింగ్ ద్వారా నిందితుడి చేతికి వచ్చిన డబ్బును బినామీ పేర్లపై వున్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వివిధ స్థిరాస్తులను కొనుగోలుచేసాడు. ఈ బెట్టింగ్ లో మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులో నిందితులపై కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు కాగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications