కర్రీ పాయింట్ ఒకరు, ట్యాక్సీ తో ఇంకొకరు : కరోనా కలిపింది ఇద్దరినీ, డబ్బు కోసం గంజాయి దందా !!
భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను వరంగల్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం టాస్క్ ఫోర్స్ మరియు జనగాం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుండి నూమారు 12లక్షల 60వేల రూపాయల విలువగల 126 కిలోల గంజాయితో పాటు, ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గుగులోత్ సుధాకర్, గుగులోత్ సురేష్, టితోలియా దినేష్ లు ఉన్నారు.

ముగ్గురు సభ్యుల గంజాయి ముఠాను పట్టుకున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు
వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ గంజాయి స్మగ్లింగ్ ముఠా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గుగులోత్ సుధాకర్ జీవనోపాధి కోసం హైదరాబాద్ లో కర్రీ పాయింట్ నిర్వహిస్తూ జీవించేవారు. ఇదే సమయంలో నిందితుడికి వరుసకు మామ అయిన వ్యక్తి ద్వారా హైదరాబాద్లో గంజాయి అమ్మకాలు జరిపే మరో నిందితుడు టితోలియా దినేష్ తో పరిచయం అయిందని తెలిపారు.

కరోనా దెబ్బ .. ఒకరికి కర్రీ పాయింట్ లో నష్టం , ఒకరికి ట్యాక్సీ బిజినెస్ లో నష్టం
కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ కారణంగా కర్రీ పాయింట్ వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్న నిందితుడు సుధాకర్ గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నాడు.ఇతనికి మరో నిందితుడు సురేష్ తో పరిచయం అయింది. సురేష్ జీవనోపాధి కోసం సెకండ్స్ లో కారును కోనుగోలు చేసి కారును టాక్సీ తిప్పుతూ డబ్బు సంపాదించేవాడు. కాని లాక్ డౌన్ కారణంగా అతని బిజినెస్ సరిగా నడవక పోవడంతో సుధాకర్ తో చేతులు కలిపాడు.

డబ్బు కోసం గంజాయి దందా మొదలుపెట్టిన ఇద్దరు
ఇద్దరూ కలిసి గంజాయి దందా చేయాలని నిర్ణయించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి అక్రమ రవాణాకు తెర తీశారు.మామ ద్వారా పరిచయమైన గంజాయి స్మగ్లర్ తో డీల్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం నుండి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి మిగతా ఇద్దరు నిందితుల ద్వారా గంజాయిని ఎక్కువ మొత్తంలో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు పలుమార్లు నర్సీపట్నం నుండి తన కారులో గంజాయిని హైదరాబాద్ కు తరలించాడు.
గంజాయి అక్రమ రవాణా యత్నం .. పట్టుకున్న పోలీసులు
ఇదే రీతిలో నిందితుడు మరోమారు ఈ నెల 29వ తేదిన నర్సీంపట్నంలో 126 కిలోల గంజాయిని కోనుగోలు చేసి రెండు కిలోల చొప్పున ప్యాకెట్లు గా తయారు చేసి తన కారులో భద్రపర్చి హైదరాబాద్ కు తరలించే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేసి నిందితులను పట్టుకున్నారు. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చెయ్యగా వారిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు .ఈ బిజినెస్ చేసే ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లాకు చెందినవారే.

భారీగా గంజాయి స్వాధీనం .. 126 కిలోల గంజాయిని, కార్ ను సీజ్ చేసిన పోలీసులు
జనగామ పోలీసులు వాహన తనిఖీలలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోని విచారించగా తాము పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితుల నుండి 126 కిలోల గంజాయితో పాటు, గంజాయి రవాణాకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కరోనా కొట్టిన దెబ్బతో అక్రమ మార్గంలో అయినా డబ్బు సంపాదించాలని గంజాయి దందాలోకి దిగి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications